IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఇలా.. 3+2 కాంబినేషన్ వర్కవుట్ అయ్యేనా?
India vs Bangladesh 1st Test: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఆసక్తికరమైన టెస్టు పోరుకి గురువారం (సెప్టెంబరు 19)న చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతోంది. పాకిస్థాన్ జట్టుని దాని సొంతగడ్డపైనే ఇటీవల టెస్టు సిరీస్‌లో చిత్తు చేసిన బంగ్లాదేశ్‌పై రిస్క్ తీసుకోకూడదని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
(1 / 11)
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ ఆడబోతున్నారు. మొన్నటి వరకు శుభమన్ గిల్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ ప్రారంభించేవాడు. కానీ లెప్ట్, రైట్ కాంబినేషన్ కోసం ఈ జోడీ బరిలోకి దిగనుంది. (PTI)
(2 / 11)
యశస్వి జైశ్వాల్ రాకతో శుభమన్ గిల్ నెం.3లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఓపెనర్‌గా మెరుగైన రికార్డులు ఉన్నప్పటికీ.. నెం.3లో ఆడిన అనుభవం గిల్‌కి ఉంది. గతంలో చతేశ్వర్ పుజారా టెస్టుల్లో నెం.3లో నమ్మదగిన బ్యాటర్‌గా ఉన్నాడు. ఇప్పుడు అతని స్థానాన్ని గిల్‌తో భర్తీ చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. (AP)
(3 / 11)
నెం.4లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి రానున్నాడు. సుదీర్ఘకాలంగా టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఈ నెం.4 బాగా కలిసొచ్చిన స్థానం. ఆరంభంలో వికెట్లు చేజారినప్పుడు ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకోనున్న కోహ్లీ.. మెరుగైన ఆరంభం లభిస్తే భారీ స్కోరుకి బాటలు వేస్తుంటాడు. (AP)
(4 / 11)
నెం.5లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కి రానున్నాడు. వాస్తవానికి రాహుల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను తుది జట్టులో ఆడించాలని మాజీ క్రికెటర్ల నుంచి డిమాండ్ వచ్చింది. కానీ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం రాహుల్ తుది జట్టులో ఉంటాడని క్లారిటీ ఇచ్చాడు (PTI)
(5 / 11)
రిషబ్ పంత్ భారత్ తరఫున టెస్టులాడి దాదాపు ఏడాదన్నర అవుతోంది. కారు యాక్సిడెంట్ తర్వాత చాలా రోజులు క్రికెట్‌కి దూరంగా ఉన్న పంత్.. ఎట్టకేలకి భారత టెస్టు టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతనికి పోటీగా జురైల్ ఉన్నా పంత్‌ను తుది జట్టులో ఆడించడానికే గంభీర్ మొగ్గు చూపుతున్నాడు. పంత్ నెం.6లో బ్యాటింగ్‌కి రానున్నాడు. (AP)
(6 / 11)
నెం.7లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కి రానున్నాడు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా భాగస్వామ్యాలను నిర్మించడంతో పాటు హిట్టింగ్ చేయడంలోనూ రవీంద్ర జడేజా దిట్ట. స్పిన్, పేస్‌ను సమర్థంగా ఎదుర్కోగలడు. మరీ ముఖ్యంగా.. చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడుతుండటంతో చెపాక్ పిచ్ జడేజాకి కొట్టినపిండి (AP)
(7 / 11)
అశ్విన్ నెం.8లో బ్యాటింగ్‌కి వస్తాడు. టెస్టుల్లో బౌలింగ్‌లోనే కాదు బ్యాటింగ్‌లోనూ అశ్విన్‌కి చెప్పుకోదగ్గ రికార్డులు ఉన్నాయి. బంగ్లాదేశ్ టీమ్ తొలి టెస్టులో అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. చెపాక్ స్టేడియంలోనే క్రికెట్ ఓనమాలు నేర్చిన అశ్విన్‌కి అక్కడి పిచ్ స్పందించే తీరుపై పూర్తి అవగాహన ఉంది. (PTI)
(8 / 11)
కుల్దీప్ యాదవ్ నెం.9 స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాడు. వాస్తవానికి కుల్దీప్ యాదవ్ స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. కానీ చెపాక్ పిచ్ సహజసిద్ధంగా స్పిన్‌కి అనుకూలం కావడంతో అశ్విన్, జడేజా, కుల్దీప్ రూపంలో ముగ్గురు ప్రొఫెషనల్ స్పిన్నర్లని తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. (AFP)
(9 / 11)
జస్‌ప్రీత్ బుమ్రా నెం.10 స్థానంలో బ్యాటింగ్‌కి వస్తుంటాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఆఖర్లో విరుచుకుపడే బుమ్రా ఇప్పటి వరకు 36 టెస్టులాడి.. 30 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. బుమ్రా మనందరికీ బౌలర్‌గానే తెలుసు. కానీ.. అగ్రశ్రేణి బౌలర్లకి కూడా ఆఖర్లో బుమ్రా చుక్కలు చూపించిన సందర్భాలు ఉన్నాయి. (PTI)
(10 / 11)
మహ్మద్ సిరాజ్ నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కి రానున్నాడు. ఈ హైదరాబాదీ క్రికెటర్‌కి బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ రికార్డులు లేవు. బౌలింగ్‌లో మాత్రం కొత్త బంతితో ప్రత్యర్థికి చుక్కలు చూపింగలడు. గత కొంతకాలంగా నిలకడగా ఈ ఫాస్ట్ బౌలర్ రాణిస్తున్నాడు.
(11 / 11)
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకి ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్ల కాంబినేషన్‌తో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ ఐదుగురు బౌలర్లలో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లు ఉండనున్నారు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు జరిగే అవకాశాలూ లేకపోలేదు. చెపాక్‌లో మ్యాచ్ గురువారం ఉదయం 9.30 గంటలకి ప్రారంభంకానుంది. (PTI)
ఇతర గ్యాలరీలు