తెలుగు న్యూస్ / ఫోటో /
Spice Jet Offers : స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్.. రూ.1515కే విమానం టికెట్ - ఇవిగో వివరాలు
- Independence Day Spice Jet Offers : స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేవలం రూ.1515కే విమానం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే రూ.15కే నచ్చిన సీటు ఎంచుకునే ఛాన్స్ కల్పిస్తోంది. వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
- Independence Day Spice Jet Offers : స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేవలం రూ.1515కే విమానం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే రూ.15కే నచ్చిన సీటు ఎంచుకునే ఛాన్స్ కల్పిస్తోంది. వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
(1 / 5)
ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పైస్ జెట్ అద్భుతమైన ప్రకటన చేసింది. ఇందులో భాగంగా కేవలం 1515 రూపాయలకే దేశీయ విమానంను ఎక్కవచ్చు. ఈ గ్రూప్ కి చెందిన విమానంలో ప్రత్యేక ఆఫర్ గా తక్కువ మొత్తంకు టికెట్ ను ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించింది.(spicejet facebook)
(2 / 5)
స్పెషల్ ఇన్ క్రెడిబుల్ ఇండిపెండెన్స్ డే సేల్ 2023 లో భాగంగా ముంబై - గోవా, జమ్మూ-కశ్మీర్, గోవా - ముంబై, గౌహతి - బాగ్డోగ్రా, చెన్నై - హైదరాబాద తో పాటు మరి కొన్ని రూట్లలో ఈ ఆఫర్ ను అందుబాటులో తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌తో పాటు రూ.2000 విలువైన కాంప్లిమెంటరీ ఫ్లైట్ వోచర్‌ను కూడా అదనంగా అందిస్తోంది స్పెస్ జెట్.(spicejet facebook)
(3 / 5)
ఆగస్టు 14 నుంచి ప్రారంభం అయిన ఈ బంపర్ ఆఫర్ ను ఆగస్టు 20వ తేదీ వరకు అందించనున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. అన్ని టాక్స్ లతో కలిపే కేవలం రూ.1515కే విమానం టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావటం విశేషం.(spicejet facebook)
(4 / 5)
ఈ ఆఫర్ లో భాగంగా విమానం టికెట్ బుక్ చేసుకున్నవారు 2023 ఆగస్టు 15 నుంచి 2024 మార్చి 30 వరకు విమాన ప్రయాణం చేయవచ్చని స్పైస్ జెట్ స్పష్టం చేసింది. ఇక మీకు నచ్చిన సీటును కేవలం రూ.15లకే రిజర్వ్ చేసుకోనే వెసులుబాటను కూడా కల్పించింది.(spicejet facebook)
(5 / 5)
ఈ అద్భుతమైన ఆఫర్ టికెట్లను www.spicejet.com వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే independencedaysale@spicejet.comకి మెయిల్ చేయవచ్చని స్పైస్ జెట్ సంస్థ తెలిపింది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి పలు ప్రాంతాలకు కూడా ఈ టికెట్లపై వెళ్లవచ్చు. ఇందులో తిరుపతి, లేహ్, శ్రీనగర్, షిల్లాంగ్, గ్యాంగ్ టక్, కొలాంబో ప్రాంతాలకు వెళ్లొచ్చు. ఇందులో కొన్ని ఫైట్స్ నేరుగా ఉంటే మరికొన్ని వన్ స్టాప్ తో ఉన్నాయి.(spicejet facebook)
ఇతర గ్యాలరీలు