South Central Railway : ప్రయాణికులకు బిగ్ అలర్ట్... ఈ తేదీ వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ల రద్దు!-south central railway cancels 37 trains due to third line works includes satavahana and golconda trains ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  South Central Railway : ప్రయాణికులకు బిగ్ అలర్ట్... ఈ తేదీ వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ల రద్దు!

South Central Railway : ప్రయాణికులకు బిగ్ అలర్ట్... ఈ తేదీ వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ల రద్దు!

Jul 26, 2024, 05:50 PM IST Maheshwaram Mahendra Chary
Jul 26, 2024, 05:50 PM , IST

  • South Central Railway Updates : ప్రయాణికులకు రైల్వేశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలోని దౌండ్‌ మార్గంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌లో 3వ లైను పనుల కారణంగా పలు రైళ్ల సేవల్లో అంతరాయం కలగనుంది. ఈ మేరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 

సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలోని దౌండ్‌ మార్గంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌లో 3వ లైను పనుల కారణంగా పలు రైళ్ల సేవల్లో అంతరాయం కలగనుంది. ఈ మేరకు రైల్వే శాఖ వివరాలను వెల్లడించింది. 

(1 / 6)

సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలోని దౌండ్‌ మార్గంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌లో 3వ లైను పనుల కారణంగా పలు రైళ్ల సేవల్లో అంతరాయం కలగనుంది. ఈ మేరకు రైల్వే శాఖ వివరాలను వెల్లడించింది. 

ఈ పనుల కారణంగా…ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు అయ్యాయి. ఇక ఈ నెల 29, 31, ఆగస్టు 1వ తేదీల్లో పుణె-సికింద్రాబాద్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ తో పాటు జూలై 29, 31న సికింద్రాబాద్‌-పుణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దయ్యాయి.

(2 / 6)

ఈ పనుల కారణంగా…ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు అయ్యాయి. ఇక ఈ నెల 29, 31, ఆగస్టు 1వ తేదీల్లో పుణె-సికింద్రాబాద్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ తో పాటు జూలై 29, 31న సికింద్రాబాద్‌-పుణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దయ్యాయి.(image source unsplash.com)

జులై 30న  సికింద్రాబాద్‌-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్‌ (12220) ముంబై-సికింద్రాబాద్‌ ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రద్దు అయ్యాయి. ఇక ఇదే తేదీలో నిజామాబాద్‌-పుణె (11410) ఎక్స్‌ప్రెస్‌ కూడా రద్దు అయింది.

(3 / 6)

జులై 30న  సికింద్రాబాద్‌-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్‌ (12220) ముంబై-సికింద్రాబాద్‌ ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రద్దు అయ్యాయి. ఇక ఇదే తేదీలో నిజామాబాద్‌-పుణె (11410) ఎక్స్‌ప్రెస్‌ కూడా రద్దు అయింది.(image source unsplash.com)

విజయవాడ - భద్రాచలం రోడ్డు(07979) ట్రైన్ ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు రద్దు అయింది. భద్రాచలం రోడ్డు - విజయవాడ మధ్య నడిచే ట్రైన్ కూడా 10వ తేదీ వరకు రద్దు అయింది. విజయవాడ - డోర్నకల్ మధ్య నడిచే (07756) ఆగస్టు 10వ తేదీ వరకు రద్దు కాగా... డోర్నకల్ - విజయవాడ మధ్య నడిచే రైలు కూడా రద్దు అయింది.  

(4 / 6)

విజయవాడ - భద్రాచలం రోడ్డు(07979) ట్రైన్ ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు రద్దు అయింది. భద్రాచలం రోడ్డు - విజయవాడ మధ్య నడిచే ట్రైన్ కూడా 10వ తేదీ వరకు రద్దు అయింది. విజయవాడ - డోర్నకల్ మధ్య నడిచే (07756) ఆగస్టు 10వ తేదీ వరకు రద్దు కాగా... డోర్నకల్ - విజయవాడ మధ్య నడిచే రైలు కూడా రద్దు అయింది.  (image source unsplash.com)

సికింద్రాబాద్ - విజయవాడ(12714) మధ్య నడిచే శాతావహన ఎక్స్ ప్రెస్ ఆగస్టు 05 నుంచి 10వ తేదీ వరకు రద్దు అయింది. ఇక సికింద్రాబాద్ - గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ ప్రెస్ కూడా 10వ తేదీ వరకు రద్దు అయింది. 

(5 / 6)

సికింద్రాబాద్ - విజయవాడ(12714) మధ్య నడిచే శాతావహన ఎక్స్ ప్రెస్ ఆగస్టు 05 నుంచి 10వ తేదీ వరకు రద్దు అయింది. ఇక సికింద్రాబాద్ - గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ ప్రెస్ కూడా 10వ తేదీ వరకు రద్దు అయింది. (image source unsplash.com)

హైదరాబాద్ - షాలిమాంర్ ఈస్టోకోస్ట్ ఎక్స్ ప్రెస్ తో పాటు సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే పద్మావతి రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.  

(6 / 6)

హైదరాబాద్ - షాలిమాంర్ ఈస్టోకోస్ట్ ఎక్స్ ప్రెస్ తో పాటు సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే పద్మావతి రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.  (image source unsplash.com)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు