Rohit Sharma: టెస్టుల్లో తొలి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు.. రోహిత్ శర్మ కంటే ముందు ఈ ఫీట్ సాధించింది ముగ్గురే
- IND vs BAN - Rohit Sharma: బంగ్లాదేశ్‍తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు బాదాడు. ఈ ఫీట్‍ను టెస్టు క్రికెట్‍లో గతంలో ముగ్గురు మాత్రమే చేశారు. నాలుగో ప్లేయర్‌గా రోహిత్ నిలిచాడు.
- IND vs BAN - Rohit Sharma: బంగ్లాదేశ్‍తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు బాదాడు. ఈ ఫీట్‍ను టెస్టు క్రికెట్‍లో గతంలో ముగ్గురు మాత్రమే చేశారు. నాలుగో ప్లేయర్‌గా రోహిత్ నిలిచాడు.
(1 / 5)
దూకుడైన బ్యాటింగ్ అంటే ఏంటో బంగ్లాదేశ్‍తో రెండో టెస్టులో భారత్ చూపించింది. టెస్టు చరిత్రలో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు చేసిన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆరంభించాడు. రెండో ఓవర్లో తొలిసారి స్ట్రైక్‍లోకి రాగా.. తొలి రెండు బంతుల్లోనే రెండు సిక్స్‌లు కొట్టాడు.
(2 / 5)
టెస్టు క్రికెట్‍లో ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్లోనే రెండు సిక్స్‌లు కొట్టడం చాలా అరుదు. టెస్టుల్లో ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. అంతకు ముందు ఇలా చేసిన ముగ్గురిలో ఇద్దరు భారత ప్లేయర్లే.
(3 / 5)
టెస్టు మ్యాచ్‍లో తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్లోనే రెండు సిక్స్‌లు కొట్టిన ఫీట్‍ను వెస్టిండీస్ ప్లేయర్ ఫోఫీ విలియమ్స్ మొదట సాధించారు. 1948లో ఇంగ్లండ్‍పై జరిగిన మ్యాచ్‍లో తన తొలి రెండు బంతుల్లో విలియమ్స్ సిక్స్‌లు బాదాడు.
(4 / 5)
ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా భారత దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఉన్నాడు. 2013లో ఆస్ట్రేలియాతో టెస్టులో తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్స్‌లుగా మలిచాడు సచిన్. నాథన్ లియాన్ బౌలింగ్‍లో రెండు సిక్స్‌లు కొట్టాడు.
(5 / 5)
అనూహ్యంగా భారత పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా ఈ ఫీట్ సాధించాడు. ఓ టెస్టులో తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు బాదాడు. 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన తొలి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు కొట్టాడు ఉమేశ్. ఈ ఘనత దక్కించుకున్న నాలుగో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అయితే, ఓపెనర్‌గా వచ్చిన తన తొలి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు కొట్టిన ఫస్ట్ ప్లేయర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు.
ఇతర గ్యాలరీలు