తెలుగు న్యూస్ / ఫోటో /
AP Rains Update: నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు..విజయవాడలో పిడుగుల వానతో జనం బెంబేలు
- AP Rains Update: ఏపీలో నేడు రేపు భారీ నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో గురు, శుక్ర వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 5)
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గురువారం ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురవొచ్చు.
(2 / 5)
గురువారం కోస్తాంధ్రలోని అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(3 / 5)
అక్టోబర్ 4 శుక్రవారం అల్లూరిసీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం మరియు పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.
(4 / 5)
శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(5 / 5)
కోస్తాలో ఆకస్మిక వానలు జనాల్ని హడలెత్తిస్తున్నాయి. అప్పటి వరకు ఉక్కపోత, ఎండలతో అల్లాడించే వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో విజయవాడలో భారీ వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి దాదాపు అరగంట పాటు పిడుగుల వాన కురిసింది. వాటి భారీ శబ్దాలకు జనం హడలెత్తిపోయారు.
ఇతర గ్యాలరీలు