తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం - ఏపీకి భారీ వర్ష సూచన..! ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Telangana Rains : దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలోని పలుచోట్ల భారీ వానలు పడొచ్చని అంచనా వేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 7)
దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది.
(2 / 7)
ఏపీలో ఇవాళ, రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇక దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువొచ్చని అంచనా వేసింది. సీమ జిల్లాల్లో మోస్తారు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వివరించింది.
(3 / 7)
తెలంగాణలో ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
(4 / 7)
రేపు (అక్టోబర్ 12) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ,మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(5 / 7)
ఎల్లుండి(అక్టోబర్ 13) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(6 / 7)
అక్టోబర్ 14 నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎలాంటి హెచ్చరికలు లేవని ప్రకటించింది.
ఇతర గ్యాలరీలు