తెలుగు న్యూస్ / ఫోటో /
Mercury Transit: ఈ నాలుగు రాశుల వారికి ఇబ్బందులు! మరింత జాగ్రత్త అవసరం
- Mercury Transit: బుధుడు త్వరలో తులారాశిలోకి అడుగుపెట్టనున్నాడు. సుమారు 20 రోజులు అదే రాశిలో సంచరించున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
- Mercury Transit: బుధుడు త్వరలో తులారాశిలోకి అడుగుపెట్టనున్నాడు. సుమారు 20 రోజులు అదే రాశిలో సంచరించున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
(1 / 6)
గ్రహాలకు రాకుమారుడిగా భావించే బుధుడి సంచారానికి జ్యోతిషంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తెలివితేటలు, స్నేహం, వాక్చాతుర్యం, ఏకాగ్రతకు కారకుడిగా బుధుడిని భావిస్తారు. అందుకే బుధుడి సంచారం రాశులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
(2 / 6)
అక్టోబర్ 10వ తేదీన తులారాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. అక్టోబర్ 29వ తేదీ వరకు తులాలోనే బుధుడు సంచరిస్తాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆ రాశులు ఏవంటే..
(3 / 6)
సింహం: ఈకాలం సింహరాశి వారికి కూడా శుభప్రదంగా ఉండదు. వీరి పని తీరు తగ్గే అవకాశం ఉంటుంది. కార్యాలయాల్లో మీపై ఫిర్యాదులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పొరపాట్ల వల్ల గౌరవం తగ్గే సూచనలు ఉన్నాయి. అందుకే ఈ కాలంలో మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి.
(4 / 6)
మేషరాశి: తులారాశిలో బుధుడి సంచారం.. మేషరాశి వారికి మంచిది కాదు. ఈ కాలంలో వీరికి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. శత్రువుల నుంచి ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆదాయం తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.
(5 / 6)
తుల: ఈరాశిలోనే బధుడు సంచరించనున్నాడు. ఈ కాలంలో తులారాశి వారికి కొన్ని విషయాల్లో కలిసి రాకపోవచ్చు. ఆర్థికంగా కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలు కాస్త మందకొడిగా సాగొచ్చు. విద్యార్థులు చదువుపై మరింత అధిక దృష్టి పెట్టాలి.
(6 / 6)
కుంభం: తులారాశిలో బుధుడు సంచరించే కాలం కుంభ రాశి వారికి అంత ప్రయోజనకరంగా ఉండదు. ఆర్థికంగా సంక్షోభం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇంట్లో అశాంతి నెలకొనొచ్చు. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాలను తీర్చుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు