శివమొగ్గలో ‘కమలం’ ఆకృతిలో విమానాశ్రయం-lotus style airport in shivmogga in bjp ruled karnataka here is a picture to watch ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  శివమొగ్గలో ‘కమలం’ ఆకృతిలో విమానాశ్రయం

శివమొగ్గలో ‘కమలం’ ఆకృతిలో విమానాశ్రయం

Feb 27, 2023, 05:10 PM IST HT Telugu Desk
Feb 27, 2023, 05:10 PM , IST

  • కర్ణాటకలో శివమొగ్గలోని సోగానే విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప శివమొగ్గ నివాసి. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ విమానాశ్రయం అతని 80వ పుట్టిన రోజున ప్రారంభమైంది. విమానాశ్రయంతో పాటు పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.

కర్ణాటకలోని శివమొగ్గలో కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు. 450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే ఇది కమలం పువ్వు ఆకారంలో నిర్మితమైంది

(1 / 5)

కర్ణాటకలోని శివమొగ్గలో కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు. 450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే ఇది కమలం పువ్వు ఆకారంలో నిర్మితమైంది(ANI)

శివమొగ్గలోని విమానాశ్రయం సహా ప్రధాన మంత్రి మోదీ పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.

(2 / 5)

శివమొగ్గలోని విమానాశ్రయం సహా ప్రధాన మంత్రి మోదీ పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.(ANI)

శివమొగ్గలో రూ.3 600 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఈ రోజు మోదీ రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. బెలగావి రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించిన తర్వాత ప్రధాని దానిని ప్రారంభించారు. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది వారాల్లోనే షెడ్యూలు విడుదల కానుంది.

(3 / 5)

శివమొగ్గలో రూ.3 600 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఈ రోజు మోదీ రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. బెలగావి రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించిన తర్వాత ప్రధాని దానిని ప్రారంభించారు. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది వారాల్లోనే షెడ్యూలు విడుదల కానుంది.(PTI)

కర్ణాటకలోని శివమొగ్గలో ఉన్న ఈ కొత్త విమానాశ్రయం బహుళ సౌకర్యాలను కలిగి ఉంది. రాత్రిపూట టేకాఫ్, ల్యాండింగ్‌ సౌకర్యాలు కూడా ఉన్నాయి. 775 ఎకరాల స్థలంలో 450 కోట్ల రూపాయలతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. విమానాశ్రయం 3.2 కి.మీ పొడవైన రన్‌వేని కలిగి ఉంది. ప్యాసింజర్ టెర్మినల్ 4320 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో ఉంది. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం తర్వాత శివమొగ్గ విమానాశ్రయం కర్ణాటకలో రెండవ అతిపెద్ద విమానాశ్రయం. 

(4 / 5)

కర్ణాటకలోని శివమొగ్గలో ఉన్న ఈ కొత్త విమానాశ్రయం బహుళ సౌకర్యాలను కలిగి ఉంది. రాత్రిపూట టేకాఫ్, ల్యాండింగ్‌ సౌకర్యాలు కూడా ఉన్నాయి. 775 ఎకరాల స్థలంలో 450 కోట్ల రూపాయలతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. విమానాశ్రయం 3.2 కి.మీ పొడవైన రన్‌వేని కలిగి ఉంది. ప్యాసింజర్ టెర్మినల్ 4320 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో ఉంది. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం తర్వాత శివమొగ్గ విమానాశ్రయం కర్ణాటకలో రెండవ అతిపెద్ద విమానాశ్రయం. (PTI)

శివమొగ్గలోని ఈ విమానాశ్రయం ప్రయాణికుల రవాణా పరంగా కర్ణాటకలోని మల్నాడు ప్రాంత నివాసితులకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప శివమొగ్గ నివాసి. ఆయన ఇటీవల ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 

(5 / 5)

శివమొగ్గలోని ఈ విమానాశ్రయం ప్రయాణికుల రవాణా పరంగా కర్ణాటకలోని మల్నాడు ప్రాంత నివాసితులకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప శివమొగ్గ నివాసి. ఆయన ఇటీవల ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. (PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు