Black cumin, honey: నల్ల జీలకర్ర, తేనె కలిపి ఏ సమయంలో తీసుకోవాలి? లాభాలేంటంటే..-know what are the benefits of taking honey with black cumin ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Black Cumin, Honey: నల్ల జీలకర్ర, తేనె కలిపి ఏ సమయంలో తీసుకోవాలి? లాభాలేంటంటే..

Black cumin, honey: నల్ల జీలకర్ర, తేనె కలిపి ఏ సమయంలో తీసుకోవాలి? లాభాలేంటంటే..

Jun 30, 2024, 11:26 AM IST Koutik Pranaya Sree
Jun 30, 2024, 11:26 AM , IST

Black cumin, honey: నల్లజీలకర్ర, తేనె కలిపి తీసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి. అవేంటో తెల్సుకోండి. 

ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం పూట చేయాల్సిన పనులేంటి? ఉదయాన్నేనల్ల జీలకర్రలో ఒక చెంచా తేనె కలుపుకుని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనివల్ల మీ ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలేంటో తెల్సుకోండి.

(1 / 9)

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తేనె, నల్ల జీలకర్రలో అనేక యాంటీఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి.ప్రతిరోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల ఇది మీ శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.మీ శరీరం అంటువ్యాధుల నుండి సులభంగా తప్పించుకోవడానికి సహాయపడుతుంది.

(2 / 9)

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. తేనెలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇది మీ గట్ లోని మంచి బ్యాక్టీరియాకు పోషణ అందిస్తుంది. నల్ల జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొట్ట ఉబ్బరం తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన  పోషకాలను జీర్ణవ్యవస్థ బాగా గ్రహించడంలో సహాయపడుతుంది.

(3 / 9)

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తేనెలోని ఇన్ఫ్లమేటరీ,  యాంటీ బాక్టీరియల్ లక్షణాలు.. నల్ల జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఈ రెండూ మొటిమలను తొలగించడానికి, మంటను తగ్గించడంలో సహాయపడతాయి. మచ్చల్లేని, ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తాయి.

(4 / 9)

బరువు నిర్వహణలో తేనె సహాయపడుతుంది. తేనె సహజ శక్తిని అందిస్తుంది. నల్ల జీలకర్ర ఆకలిని తీర్చి శరీర జీవక్రియను ప్రోత్సహిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. శరీర జీవక్రియను పెంచుతుంది.

(5 / 9)

వీటిని కలిపి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగు పడుతుంది. తేనె, నల్ల జీలకర్ర శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.  దీనిని తరచుగా తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గిస్తుంది.. 

(6 / 9)

మంటను తగ్గిస్తుంది. తేనె, నల్ల జీలకర్ర యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి శరీరంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి. నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇది  ప్రయోజనకరంగా ఉంటుంది.

(7 / 9)

నల్ల జీలకర్ర మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెదడు చురుకుదనం పెరిగినప్పుడు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడుతుంది. ఇది మీ పనితీరును పెంచి రోజంతా మీ మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది.

(8 / 9)

తేనె రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. తేనెలోని సహజ తీపి లక్షణాలు, తక్కువగా ఉన్న  గ్లైసెమిక్ లక్షణాలు దీనికి సహాయపడతాయి. నల్ల జీలకర్ర ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. ఈ కలయిక రక్తంలో చక్కెర స్థాయిలను సక్రమంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు