Khairatabad Ganesh Shobha Yatra : ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర.. చూడడానికి రెండు కళ్లు చాలవు-khairatabad ganesh shobha yatra is grand in hyderabad city ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Khairatabad Ganesh Shobha Yatra : ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర.. చూడడానికి రెండు కళ్లు చాలవు

Khairatabad Ganesh Shobha Yatra : ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర.. చూడడానికి రెండు కళ్లు చాలవు

Published Sep 17, 2024 12:48 PM IST Basani Shiva Kumar
Published Sep 17, 2024 12:48 PM IST

  • Khairatabad Ganesh Shobha Yatra : జై భోలో గణేష్ మహారాజ్‌కీ.. జై.. ఈ నినాదాలతో హుస్సేన్ సాగర్ పరిసరాలు మార్మోగుతున్నాయి. మరోవైపు ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర.. డప్పు చప్పుళ్లు, భక్తుల నృత్యాలు.. గణపతి నినాదాల మధ్య కొనసాగింది. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు.

హుస్సేన్ సాగర్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం పరిసరాల్లోకి ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వచ్చారు. జై భోలో గణేష్ మహారాజ్‌కీ.. జై..  అంటూ నినాదాలు చేశారు. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రను తిలకించారు. వాతావరణం చల్లబడటంతో పెద్ద ఎత్తున జనం వచ్చారు. గణపతి భక్తులతో సచివాలయం చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్ కిటకిటలాడింది.

(1 / 6)

ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనం కోసం సూపర్ క్రేన్ ఏర్పాటు చేశారు. 70 అడుగుల మహాగణపతి విగ్రహం కోసం బాహుబలి క్రేన్‌ను సిద్ధం చేశారు. 350 టన్నుల బరువు ఎత్తేలా ఎన్టీఆర్ మార్గ్లో భారీ క్రేన్ ఉంది. ఇది 80 మీటర్ల పొడవు ఉంది. దీన్ని శంషాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారు. 

(2 / 6)

పోలీసులు- భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ మధ్య వాగ్వాదం జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులు వెహికిల్‌కి అడ్డంగా కూర్చున్నారు. దీంతో కమిటీ సభ్యులకు పోలీసులు నచ్చజెప్పారు. వేగంగా కదిలిస్తున్నారని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కూడా కల్పించడం లేదని గణేశ్ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది.

(3 / 6)

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగే క్రేన్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. క్రేన్ డ్రైవర్‌తో మాట్లాడిన సీఎం.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆరా తీశారు. అత్యంత జాగ్రత్త నిమజ్జనం చేయాలని సూచించారు. 

(4 / 6)

సచివాలయం వద్ద పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఖైరతాబాద్ గణేష్ చూడడానికి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంగణంలోకి పలువురు దూకారు. దీంతో ఒక్కసారిగా భారీగా జనం గేటు దుకారు. అలెర్ట్ అయిన పోలీసులు.. వెంటనే వారందరిని బయటకు పంపారు.

(5 / 6)

ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రలో.. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రత్యేక ఆర్షణగా నిలిచారు. గణపతి భక్తులతో దానం నాగేందర్ డ్యాన్స్ వేసి.. ఉత్తేజాన్ని నింపారు. ఆయనతో కలిసి భక్తులు కూడా నృత్యం చేశారు. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు