Vivo V25 Pro Review | ఈ ఊసరవెల్లి ఫోన్ పనితీరు ఎలా ఉంది? రివ్యూ చూడండి!-is it worth buying vivo v25 pro smartphone at inr 36k check out reviews here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vivo V25 Pro Review | ఈ ఊసరవెల్లి ఫోన్ పనితీరు ఎలా ఉంది? రివ్యూ చూడండి!

Vivo V25 Pro Review | ఈ ఊసరవెల్లి ఫోన్ పనితీరు ఎలా ఉంది? రివ్యూ చూడండి!

Aug 28, 2022, 12:49 PM IST HT Telugu Desk
Aug 28, 2022, 12:49 PM , IST

  • స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో ఇటీవలే Vivo V25 Proపేరుతో ఒక స్టైలిష్ మధ్య-శ్రేణి ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ ఎండ తగిలినపుడు రంగు మారుతుంది. మార్కెట్లో ఈ Vivo V25 Pro ధర రూ. 35,999/-. మరి ఇంత ఖరీదుపెట్టి ఈ ఫోన్ కొనుగోలు చేయటం సరైనదేనా? రివ్యూ చూడండి.

Vivo V25 Proలో రాత్రిపూట కూడా ప్రకాశవంతమైన, స్పష్టమైన చిత్రాలను తీయగలిగే 64 MP OIS ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇదే కాకుండా వెనకవైపు 8MP వైడ్ యాంగిల్, 2MP మాక్రో లెన్స్‌లను కలిగి ఉంది. ఇక ముందు వైపు పోర్ట్రెయిట్ మోడ్‌తో కూడిన 32MP సెల్ఫీ కెమెరాతో తీసే ఫోటోలు సజీవంగా, స్పష్టంగా, స్కిన్ టోన్‌కు అనుగుణంగా కనిపించేలా చేస్తుంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న పువ్వును Vivo V25 Proతో తీసినదే.

(1 / 7)

Vivo V25 Proలో రాత్రిపూట కూడా ప్రకాశవంతమైన, స్పష్టమైన చిత్రాలను తీయగలిగే 64 MP OIS ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇదే కాకుండా వెనకవైపు 8MP వైడ్ యాంగిల్, 2MP మాక్రో లెన్స్‌లను కలిగి ఉంది. ఇక ముందు వైపు పోర్ట్రెయిట్ మోడ్‌తో కూడిన 32MP సెల్ఫీ కెమెరాతో తీసే ఫోటోలు సజీవంగా, స్పష్టంగా, స్కిన్ టోన్‌కు అనుగుణంగా కనిపించేలా చేస్తుంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న పువ్వును Vivo V25 Proతో తీసినదే.

Vivo V25 Pro వంపు అంచులతో సొగసైన డిజైన్ కలిగి ఉంది. వెనుక ప్యానెల్ మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంది. ఈ ఫోన్ పట్టుకోవడం సౌకర్యంగా ఉంటుంది. ఇందులోని బ్లూకలర్ మోడల్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇది దాని కలర్ షేడ్‌తో మ్యాజిక్ చేస్తుంది. ఎండపడితే నలుపురంగులోకి మారుతుంది. అయితే బ్లాక్ కలర్ మోడల్ మాత్రం ఎలాంటి రంగు మారదు. బ్లాక్ కలర్ లోనే ఉంటుంది.

(2 / 7)

Vivo V25 Pro వంపు అంచులతో సొగసైన డిజైన్ కలిగి ఉంది. వెనుక ప్యానెల్ మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంది. ఈ ఫోన్ పట్టుకోవడం సౌకర్యంగా ఉంటుంది. ఇందులోని బ్లూకలర్ మోడల్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇది దాని కలర్ షేడ్‌తో మ్యాజిక్ చేస్తుంది. ఎండపడితే నలుపురంగులోకి మారుతుంది. అయితే బ్లాక్ కలర్ మోడల్ మాత్రం ఎలాంటి రంగు మారదు. బ్లాక్ కలర్ లోనే ఉంటుంది.(Vivo)

120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.56-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో Vivo V25 Pro గొప్ప వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.

(3 / 7)

120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.56-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో Vivo V25 Pro గొప్ప వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.(Vivo )

Vivo V25 Proలో 4830mAh బ్యాటరీతో వచ్చింది. ఇది 66W FlashChargingకు సపోర్ట్ చేస్తుంది. దాదాపు 50-60 నిమిషాల్లో ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇందులో మంచి సౌండ్ కలిగిన సింగిల్ స్పీకర్‌ ఉంటుంది కానీ క్లారిటీ, బేస్ ఆశించిన స్థాయిలో లేదు. స్టీరియో స్పీకర్ పనితీరు బాగా తగ్గింది. 

(4 / 7)

Vivo V25 Proలో 4830mAh బ్యాటరీతో వచ్చింది. ఇది 66W FlashChargingకు సపోర్ట్ చేస్తుంది. దాదాపు 50-60 నిమిషాల్లో ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇందులో మంచి సౌండ్ కలిగిన సింగిల్ స్పీకర్‌ ఉంటుంది కానీ క్లారిటీ, బేస్ ఆశించిన స్థాయిలో లేదు. స్టీరియో స్పీకర్ పనితీరు బాగా తగ్గింది. (Vivo)

Vivo V25 Proలో మీడియా డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌ ఉంటుంది. ఇది వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. Asphalt 9 వంటి గ్రాఫిక్-రిచ్ గేమ్‌లను గరిష్ట సెట్టింగ్‌లలో నిర్వహిస్తుంది.

(5 / 7)

Vivo V25 Proలో మీడియా డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌ ఉంటుంది. ఇది వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. Asphalt 9 వంటి గ్రాఫిక్-రిచ్ గేమ్‌లను గరిష్ట సెట్టింగ్‌లలో నిర్వహిస్తుంది.(Vivo )

ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన కెమెరా పనితీరు, కర్వ్డ్ డిస్‌ప్లే కలిగిన మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే. మీ బడ్జెట్ రూ. 35 వేలు అయితే ఈ ఫోన్ మీకు సరిపోతుంది.

(6 / 7)

ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన కెమెరా పనితీరు, కర్వ్డ్ డిస్‌ప్లే కలిగిన మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే. మీ బడ్జెట్ రూ. 35 వేలు అయితే ఈ ఫోన్ మీకు సరిపోతుంది.(Vivo)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు