IPL 2023: ఈ పది మందిపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంఛైజీలు.. మరి ఇరగదీస్తారా?
IPL 2023: ఈ పది మందిపై కోట్లు కుమ్మరించాయి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు. మరి వీళ్లు ఇరగదీస్తారా? ఆయా టీమ్స్ తమపై పెట్టుకున్న అంచనాలను అందుకుంటారా? ఐపీఎల్ 16వ సీజన్ శుక్రవారం (మార్చి 31) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అత్యధిక మొత్తం అందుకుంటున్న ఆ ప్లేయర్స్ ఎవరో చూద్దాం.
(1 / 10)
IPL 2023: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్. ఇతన్ని గత వేలంలో పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకూ ఐపీఎల్ టైటిల్ గెలవని ఆ ఫ్రాంఛైజీ.. కరన్ పై భారీ ఆశలే పెట్టుకుంది. గత సీజన్ వరకూ చెన్నై టీమ్ తో ఉన్న కరన్.. ఈసారి అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.
(2 / 10)
IPL 2023: కరన్ తర్వాత ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ రూ.17.5 కోట్ల ధరతో రెండోస్థానంలో ఉన్నాడు. ఇతన్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఎన్నడూ లేని విధంగా గత సీజన్ లో దారుణమైన ప్రదర్శన కనబర్చిన ముంబై టీమ్.. ఈసారి గ్రీన్ ఏదో మ్యాజిక్ చేస్తాడని నమ్ముతోంది. ఈ మధ్యే ఇండియా పర్యటనలో రాణించిన గ్రీన్ అదే ఫామ్ కొనసాగిస్తాడని ఆశతో ఉంది.
(3 / 10)
IPL 2023: ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.5 కోట్లకు కొనుగోలు చేసింది. ధోనీ తర్వాత తమ కెప్టెన్సీ స్టోక్స్‌కే అప్పగించాలని భావిస్తున్న సీఎస్కే.. అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది. గాయం వల్ల మొదటి కొన్ని మ్యాచ్ లలో స్టోక్స్ కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కానున్నాడు.
(4 / 10)
IPL 2023: గత సీజన్‌లో పెద్దగా రాణించకపోయినా విండీస్ స్టార్ నికొలస్ పూరన్‌ను ఏకంగా రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. ఇది ఆశ్చర్యానికి గురి చేసేదే. మరి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ను ఆ టీమ్ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. మిడిలార్డర్‌లో మంచి హిట్టర్ అయిన పూరన్.. అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.
(5 / 10)
IPL 2023: ఇంగ్లండ్ లేటెస్ట్ సెన్సేషన్ హ్యారీ బ్రూక్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. టెస్ట్ క్రికెట్‌లో దూసుకెళ్తున్న బ్రూక్.. ఈ మెగా లీగ్‌లో సన్ రైజర్స్ మిడిలార్డర్ భారాన్ని మోయనున్నాడు.
(6 / 10)
IPL 2023: మయాంక్ అగర్వాల్ ను కూడా సన్ రైజర్స్ టీమ్ రూ.8.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గతేడాది పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన మయాంక్.. ఈసారి హైదరాబాద్ తరఫున ఓపెనింగ్ చేయనున్నాడు.
(7 / 10)
IPL 2023: లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీతో రూ.17 కోట్లకు గతేడాది ఒప్పందం కుదుర్చుకున్నాడు కేఎల్ రాహుల్. తొలి సీజన్ లోనే కెప్టెన్ గా, ప్లేయర్ గా రాణించి ఆ జట్టును ప్లేఆఫ్స్ కు తీసుకెళ్లాడు. ఈసారి పెద్దగా ఫామ్‌లో లేని అతడు ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.(PTI)
(8 / 10)
IPL 2023: ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మకు ఆ ఫ్రాంఛైజీ రూ.16 కోట్లు చెల్లిస్తోంది. గతేడాది దారుణమైన ప్రదర్శన నేపథ్యంలో ఈసారి ఈ టీమిండియా కెప్టెన్ ఏం చేస్తాడో చూడాలి.(PTI)
(9 / 10)
IPL 2023: గత సీజన్ లో సీఎస్కే జట్టుకు కెప్టెన్ గానూ చేసి విఫలమైన రవీంద్ర జడేజాను రూ.16 కోట్లు పెట్టి రిటెయిన్ చేసుకుంది. ఈ ఆల్ రౌండర్ గాయం నుంచి కోలుకొని వచ్చి టీమిండియా తరఫున రాణించడంతో ఈ సీజన్ లో అతనిపై చెన్నై సూపర్ కింగ్స్ భారీ ఆశలు పెట్టుకుంది.
ఇతర గ్యాలరీలు