(1 / 5)
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 షురూ అయింది. దీంట్లోనూ విజయం సాధించించి మూడు టీ20ల సిరీస్‍ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని భారత్ జోష్‍లో ఉంది .
(AFP)(2 / 5)
ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హునేన్ శాంతో ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగనుంది.
(AFP)(3 / 5)
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. పిచ్ బ్యాటంగ్‍కు అనుకూలంగా ఉంది. తాము కూడా ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగే చేయాలని అనుకున్నామని టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు.
(AFP)(4 / 5)
తొలి టీ20తో పోలిస్తే రెండు మ్యాచ్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు భారత్. విన్నింగ్ కాంబినేషన్‍నే కొనసాగించింది. రెండో టీ20లో భారత తుదిజట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్య, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్.
(AFP)(5 / 5)
తుది జట్టులో బంగ్లాదేశ్ ఓ మార్పు చేసింది. షరీఫుల్ ఇస్లాం స్థానంలో తంజిమ్ షకీబ్‍ను తీసుకుంది. బంగ్లాదేశ్ తుదిజట్టు: పర్వేజ్ హుసేన్ ఇమోన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుసేన్, టస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రహమాన్
(AFP)ఇతర గ్యాలరీలు