తెలుగు న్యూస్ / ఫోటో /
BMW XM Label Red: ఇప్పుడు మరింత పవర్ ఫుల్ గా బీఎండబ్ల్యూ ఎక్స్ఎం లేబుల్ రెడ్
ప్రీమియం మోటార్ కార్ బ్రాండ్ బీఎండబ్ల్యూ (BMW) ఇప్పుడు లేటెస్ట్ గా బీఎండబ్ల్యూ ఎక్స్ఎం (BMW XM) లేబుల్ రెడ్ (Label Red) SUV ను లాంచ్ చేయనుంది. ఈ లేబుల్ రెడ్ (Label Red) SUV ని బీఎండబ్ల్యూ (BMW) మరింత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దింది.
(1 / 8)
BMW XM Label Red: స్టాండర్డ్ BMW XM కన్నా ఇది మరింత పవర్ ఫుల్ వర్షన్. అంటే మోర్ టార్క్, మోర్ పవర్, మోర్ స్పీడ్ అన్నమాట.
(2 / 8)
BMW XM Label Red: ఈ మోడల్ ను BMW చైనాలో జరిగిన ఆటో షాంఘై ఎక్స్ పో 2023లో తొలిసారి ప్రదర్శించింది.
(3 / 8)
BMW XM Label Red: ఈ మోడల్ కు ఎక్సటీరియర్స్ ను మరింత డైనమిక్ గా, పవర్ ఫుల్ లుక్స్ తో రూపొందించారు.
(4 / 8)
BMW XM Label Red ఈ మోడల్ రేడియేటర్ గ్రిల్ ను కిడ్నీ ఆకారంలో తీర్చి దిద్దారు. గ్రిల్ సైజ్ ను కూడా పెంచారు. రెడ్ కలర్ ట్రిమ్స్ తో రేడియేటర్ గ్రిల్ ఆకర్షణీయంగా రూపొందింది.
(5 / 8)
BMW XM Label Red: ఈ మోడల్ సైడ్ ప్రొఫైల్ లో కూడా రెడ్ కలర్ ట్రిమ్స్ ను ఏర్పాటు చేశారు. ఈ రెడ్ కలర్ ట్రిమ్స్ ఈ కారుకు ఒక స్పెషల్ సిగ్నేచర్ టోన్ ను ఇచ్చాయి. అలాయ్ వీల్స్ పై కూడా ఈ రెడ్ ట్రిమ్స్ ను ఏర్పాటు చేశారు.
(6 / 8)
BMW XM Label Red: స్లీక్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, నాలుగు ఎగ్జాస్ట్ పైప్స్, అట్రాక్టివ్ స్కిడ్ ప్లేట్ లో కార్ వెనుక భాగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు.
(7 / 8)
BMW XM Label Red: క్యాబిన్ ఫీచర్లను కూడా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. దాంతో, ఇంటీరియర్స్ కు కూడా స్పోర్టీ లుక్ వచ్చింది.
ఇతర గ్యాలరీలు