Eid-ul-Adha: భక్తి శ్రద్ధలతో ‘బక్రీద్’ - దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు-devotees offer namaz on the occasion of eid ala dha details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Eid-ul-adha: భక్తి శ్రద్ధలతో ‘బక్రీద్’ - దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు

Eid-ul-Adha: భక్తి శ్రద్ధలతో ‘బక్రీద్’ - దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు

Jul 10, 2022, 12:35 PM IST HT Telugu Desk
Jul 10, 2022, 12:35 PM , IST

  • Eid-ul-Adha 2022: దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఓవైపు ఏకాదశి, మరోవైపు బక్రీద్ కావటంతో… పండగ వాతావరణం నెలకొంది. ముస్లింలు భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ పర్వదినాన్ని జరుపుకున్నారు.  ఈద్‌ ఉల్ అదా సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  ఈ పండగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రధాని,  పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు జరుగుతున్నాయి. మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ఢిల్లీలోని జామా మసీదు, జహంగీర్ పురి మసీదు, సీలంపూర్ ఉమర్ మసీదు, ఫతేపురి మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. 

(1 / 7)

దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు జరుగుతున్నాయి. మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ఢిల్లీలోని జామా మసీదు, జహంగీర్ పురి మసీదు, సీలంపూర్ ఉమర్ మసీదు, ఫతేపురి మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. (HT)

ఈద్‌ ఉల్ అదా సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముస్లింలు. ప్రత్యేక పర్వదినం సందర్భంగా ముస్లింలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు.  త్యాగానికి, మానవసేవకు ప్రతీకగా బక్రీద్‌ను జరుపుకుంటారని.. అదే సేవాభావంతో దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

(2 / 7)

ఈద్‌ ఉల్ అదా సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముస్లింలు. ప్రత్యేక పర్వదినం సందర్భంగా ముస్లింలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు.  త్యాగానికి, మానవసేవకు ప్రతీకగా బక్రీద్‌ను జరుపుకుంటారని.. అదే సేవాభావంతో దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.(HT)

బక్రీద్ పండుగ మానవాళి మంచి కోసం కృషి చేయ‌డానికి స్ఫూర్తిని మరింత పెంచుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.  ఈ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

(3 / 7)

బక్రీద్ పండుగ మానవాళి మంచి కోసం కృషి చేయ‌డానికి స్ఫూర్తిని మరింత పెంచుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.  ఈ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.(HT)

బక్రీద్ పండగ సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈద్ - ఉల్ - అదాతో ముడిపడి ఉండే ఆదర్శభావాలు శాంతి, మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా విషెష్ చెప్పారు.

(4 / 7)

బక్రీద్ పండగ సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈద్ - ఉల్ - అదాతో ముడిపడి ఉండే ఆదర్శభావాలు శాంతి, మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా విషెష్ చెప్పారు.(HT)

ప్రత్యేక ప్రార్థనల్లో భాగంగా మసీదులకు వచ్చిన చిన్నారులు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచారు. ఒకరికి ఒకరు బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

(5 / 7)

ప్రత్యేక ప్రార్థనల్లో భాగంగా మసీదులకు వచ్చిన చిన్నారులు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచారు. ఒకరికి ఒకరు బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.(ANI)

బక్రీద్ వేళ  అట్టారీ-వాఘా సరిహద్దుల్లో భారత్, పాకిస్థాన్ సైనికులు  పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. బక్రీద్ శుభాకంక్షలు చెప్పుకున్నారు.

(6 / 7)

బక్రీద్ వేళ  అట్టారీ-వాఘా సరిహద్దుల్లో భారత్, పాకిస్థాన్ సైనికులు  పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. బక్రీద్ శుభాకంక్షలు చెప్పుకున్నారు.(ANI)

బక్రీద్‌ పర్వదినం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై ముస్లింలకు శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ వేడుకలతో సోదరభావం, సేవాతత్వం, త్యాగ గుణాలు మరింత బలపడతాయన్న ఆశాభా వాన్ని ఆమె వ్యక్తం చేశారు. ముస్లింలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

(7 / 7)

బక్రీద్‌ పర్వదినం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై ముస్లింలకు శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ వేడుకలతో సోదరభావం, సేవాతత్వం, త్యాగ గుణాలు మరింత బలపడతాయన్న ఆశాభా వాన్ని ఆమె వ్యక్తం చేశారు. ముస్లింలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.(ANI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు