తెలుగు న్యూస్ / ఫోటో /
Cars launch in November : నవంబర్‌లో లాంచ్‌కు సిద్ధమవుతున్న కార్లు ఇవే!
- Cars launch in November : పండుగ సీజన్లో క్రేజీ ఆఫర్స్ ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్న పలు ఆటోమొబైల్ సంస్థలు.. నవంబర్‌లో కొత్త కొత్త వాహనాల లాంచ్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వీటితో పాటు పలు అంతర్జాతీయ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు..

(1 / 5)
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ.. ఇటీవలే అంతర్జాతీయంగా లాంచ్ అయ్యింది. నవంబర్ 2న ఈ మోడల్ ఇండియాలోకి అడుగుపెట్టనుంది. ఇందులో 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్స్‌షోరూం ధర రూ. 93లక్షలకు అటు, ఇటుగా ఉండొచ్చు.
(2 / 5)
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈతో పాటు సీ43 ఏఎంజీ కూడా ఇండియాలో లాంచ్ అవ్వనుంది. లాంచ్ డేట్‌పై ఇంకా క్లారిటీ లేదు. కాగా.. బేస్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 1కోటిగా ఉండొచ్చు.
(3 / 5)
టాటా పంచ్ ఈవీ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ నుంచి ఈ మోడల్ లాంచ్ కోసం నిరీక్షణలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పుడు.. నవంబర్‌లో ఈ మోడల్ లాంచ్ అవుతుందని టాక్ నడుస్తోంది.
(4 / 5)
స్కోడా సూపర్బ్కు సంబంధించి పలు టీజర్స్‌ని వదిలింది సంస్థ. ఈ మోడల్ని అంతర్జాతీయంగా.. నవంబర్ 2న ఆవిష్కరించనుంది. ఇండియాలో ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 40లక్షలుగా ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో ఇది ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టొచ్చు.
ఇతర గ్యాలరీలు