తెలుగు న్యూస్ / ఫోటో /
Border Gavaskar trophy: రేపటి నుంచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. పైచేయి ఎవరిది?
Border Gavaskar trophy: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ప్రారంభం కానుంది. వరుసగా మూడుసార్లు ఈ ట్రోఫీని సొంతం చేసుకున్న ఇండియా.. ఈసారి స్వదేశంలో తన రికార్డును మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.
(1 / 7)
Border Gavaskar trophy: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య 16వ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కాబోతోంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్ గురువారం (ఫిబ్రవరి 9) నాగ్‌పూర్ టెస్ట్ తో మొదలవుతుంది. (AFP)
(2 / 7)
Border Gavaskar trophy: సిరీస్ ప్రారంభానికి ముందే పిచ్ లపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నాగ్‌పూర్ పిచ్‌ను ఇండియాకు అనుకూలంగా మారుస్తున్నారంటూ ఆస్ట్రేలియా మీడియా కథనాలు రాసిన వేళ ఆ పిచ్ ను టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పరిశీలించాడు.(ANI)
(3 / 7)
Border Gavaskar trophy: నాగ్‌పూర్ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్లేయర్స్ ప్రాక్టీస్. ఇండియాకు వచ్చిన తర్వాత నాలుగు రోజులు బెంగళూరులో ప్రత్యేకంగా స్పిన్ పిచ్ లపై ప్రాక్టీస్ చేసిన ఆ టీమ్.. తర్వాత నాగ్‌పూర్ వచ్చింది.(ANI)
(4 / 7)
Border Gavaskar trophy: టీమిండియా వారం రోజుల కిందటే నాగ్‌పూర్ వచ్చి ప్రాక్టీస్ చేస్తోంది. ఆస్ట్రేలియాలాగే స్పిన్ బౌలింగే లక్ష్యంగా మన బ్యాటర్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేశారు.(ANI)
(5 / 7)
Border Gavaskar trophy: ఇండియాలో ఎలాగూ స్పిన్ పిచ్ లు ఎదురవుతాయని భావించిన ఆస్ట్రేలియా ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.(ANI)
(6 / 7)
Border Gavaskar trophy: ఇండియా, ఆస్ట్రేలియా కెప్టెన్లు రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని బుధవారం (ఫిబ్రవరి 8) ఆవిష్కరించారు. ఆ తర్వాత ఇద్దరు కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు.(AP)
ఇతర గ్యాలరీలు