Night treks in India: ట్రెకింగ్ మీ హాబీనా? ఈ అద్భుతమైన నైట్ ట్రెకింగ్స్ ట్రై చేశారా? జీవితంలో మర్చిపోలేరు..-7 night treks in india that promise unforgettable adventures ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Night Treks In India: ట్రెకింగ్ మీ హాబీనా? ఈ అద్భుతమైన నైట్ ట్రెకింగ్స్ ట్రై చేశారా? జీవితంలో మర్చిపోలేరు..

Night treks in India: ట్రెకింగ్ మీ హాబీనా? ఈ అద్భుతమైన నైట్ ట్రెకింగ్స్ ట్రై చేశారా? జీవితంలో మర్చిపోలేరు..

Dec 07, 2023, 05:39 PM IST HT Telugu Desk
Dec 07, 2023, 05:39 PM , IST

Night treks in India: బిజీ లైఫ్ లో ఊరటనిచ్చేవి హాబీలే. అందులోనూ ట్రెక్కింగ్ వంటి హాబీ ఉంటే ఇక చెప్పనక్కర లేదు. భారత్ లో రాత్రి సమయంలో ట్రెక్కింగ్ కు అవకాశమున్న బెస్ట్ ప్లేసెస్ ఇవి..

భారతదేశంలోని అనేక హిల్ స్టేషన్లు చిరస్మరణీయమైన శీతాకాలపు అనుభూతినిస్తాయి. ఈ కాలంలో కొందరునైట్ ట్రెకింగ్ లను ఇష్టపడ్తారు. వారి కోసం అద్భుతమైన అనుభూతిని ఇచ్చే 7 ట్రెకింగ్ ప్లేసెస్ ఇవి.

(1 / 8)

భారతదేశంలోని అనేక హిల్ స్టేషన్లు చిరస్మరణీయమైన శీతాకాలపు అనుభూతినిస్తాయి. ఈ కాలంలో కొందరునైట్ ట్రెకింగ్ లను ఇష్టపడ్తారు. వారి కోసం అద్భుతమైన అనుభూతిని ఇచ్చే 7 ట్రెకింగ్ ప్లేసెస్ ఇవి.(Representative Image (Unsplash))

కర్నాటకలోని అంతర గంగ ట్రెక్. బెంగళూరు నుంచి 65 కిమీల దూరంలో ఉంటుంది. 3 కిమీలు ఉండే ఈ ట్రెకింగ్ అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. పైకి వెళ్తున్న కొద్ది అడ్వెంచరస్ గా మారుతుంది. చివరగా ఒక గుహ వద్దకు చేరుతారు.

(2 / 8)

కర్నాటకలోని అంతర గంగ ట్రెక్. బెంగళూరు నుంచి 65 కిమీల దూరంలో ఉంటుంది. 3 కిమీలు ఉండే ఈ ట్రెకింగ్ అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. పైకి వెళ్తున్న కొద్ది అడ్వెంచరస్ గా మారుతుంది. చివరగా ఒక గుహ వద్దకు చేరుతారు.(Representative Image)

చన్నారాయణ దుర్గా ట్రెక్: ఇది కూడా కర్నాటకలోనే ఉంది. ఈ చన్నారాయణ దుర్గా ట్రెక్ తుమకూరు సమీపంలో ఉన్న చన్నారాయణ దుర్గ, గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. పైకి చేరుకున్న తరువాత అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.

(3 / 8)

చన్నారాయణ దుర్గా ట్రెక్: ఇది కూడా కర్నాటకలోనే ఉంది. ఈ చన్నారాయణ దుర్గా ట్రెక్ తుమకూరు సమీపంలో ఉన్న చన్నారాయణ దుర్గ, గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. పైకి చేరుకున్న తరువాత అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.(Representative Image)

ధోత్రే-టోంగ్లూ ట్రెక్: ఇది పశ్చిమ బెంగాల్ లో ఉంది. పచ్చని అడవుల నుంచి, మంచుతో కప్పబడిన పర్వతాల వరకు ప్రకృతి దృశ్యాలతో, ఈ ట్రెక్ ఉత్కంఠభరితమైన అనుభవాలను అందిస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోని సింగలీలా నేషనల్ పార్క్ సమీపంలో డార్జిలింగ్‌లో ఉన్న ధోత్రే నుంచి ఈ ట్రెక్ ప్రారంభమవుతుంది.

(4 / 8)

ధోత్రే-టోంగ్లూ ట్రెక్: ఇది పశ్చిమ బెంగాల్ లో ఉంది. పచ్చని అడవుల నుంచి, మంచుతో కప్పబడిన పర్వతాల వరకు ప్రకృతి దృశ్యాలతో, ఈ ట్రెక్ ఉత్కంఠభరితమైన అనుభవాలను అందిస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోని సింగలీలా నేషనల్ పార్క్ సమీపంలో డార్జిలింగ్‌లో ఉన్న ధోత్రే నుంచి ఈ ట్రెక్ ప్రారంభమవుతుంది.(Representative Image)

సింహగడ్ ఫోర్ట్ ట్రెక్:  ఇది మహారాష్ట్రలో ఉంది.. ‘కత్రాజ్ టు సింహగడ్’ (K2S) ట్రెక్ అని దీన్ని పిలుస్తారు. పౌర్ణమి సమయంలో ఈ ట్రెక్ కు వెళ్లాలి. ఈ ట్రెక్ సుమారు 2.5 కిమీలు ఉంటుంది.

(5 / 8)

సింహగడ్ ఫోర్ట్ ట్రెక్:  ఇది మహారాష్ట్రలో ఉంది.. ‘కత్రాజ్ టు సింహగడ్’ (K2S) ట్రెక్ అని దీన్ని పిలుస్తారు. పౌర్ణమి సమయంలో ఈ ట్రెక్ కు వెళ్లాలి. ఈ ట్రెక్ సుమారు 2.5 కిమీలు ఉంటుంది.(Representative Image)

కల్సుబాయి ట్రెక్: ఇది కూడా మహారాష్ట్రలో ఉంది. కల్సుబాయి పర్వతం సహ్యాద్రి శ్రేణుల్లో ఉంటుంది. ఇక్కడికి ముంబై నుంచి, పూణె నుంచి కూడా సులభంగా చేరుకోవచ్చు. కల్సుబాయి ట్రెక్కింగ్ లో అలంగ్, మదన్, కులాంగ్ వంటి ప్రసిద్ధ కోటలను చూడవచ్చు. ఈ ట్రెకింగ్ రాత్రి మొదలైతే,  సూర్యోదయానికి పూర్తవుతుంది.

(6 / 8)

కల్సుబాయి ట్రెక్: ఇది కూడా మహారాష్ట్రలో ఉంది. కల్సుబాయి పర్వతం సహ్యాద్రి శ్రేణుల్లో ఉంటుంది. ఇక్కడికి ముంబై నుంచి, పూణె నుంచి కూడా సులభంగా చేరుకోవచ్చు. కల్సుబాయి ట్రెక్కింగ్ లో అలంగ్, మదన్, కులాంగ్ వంటి ప్రసిద్ధ కోటలను చూడవచ్చు. ఈ ట్రెకింగ్ రాత్రి మొదలైతే,  సూర్యోదయానికి పూర్తవుతుంది.(Representative Image)

మీసపులిమల టాప్ స్టేషన్ ట్రెక్: :ఇది కేరళలో ఉంది. పశ్చిమ కనుమలలో రెండవ ఎత్తైన శిఖరం ఈ మీసపులిమల. టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ నుంచి చుట్టూ టీ తోటలు, ఆకుపచ్చని లోయలతో కూడిన ప్రకృతి అందాలను చూడడం ఒక అద్భుతం.

(7 / 8)

మీసపులిమల టాప్ స్టేషన్ ట్రెక్: :ఇది కేరళలో ఉంది. పశ్చిమ కనుమలలో రెండవ ఎత్తైన శిఖరం ఈ మీసపులిమల. టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ నుంచి చుట్టూ టీ తోటలు, ఆకుపచ్చని లోయలతో కూడిన ప్రకృతి అందాలను చూడడం ఒక అద్భుతం.

రాజ్‌మచి ఫోర్ట్ ట్రెక్: ఇది మహారాష్ట్రలో ఉంది. రాజ్‌మచి సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడ పర్వతంపై ఒక చరిత్రాత్మకమైన కోట ఉంది.  ఈ ట్రెక్ సుమారు 10 కి.మీ.లు ఉంటుంది. అంతా కాలిబాటనే. ట్రెక్ పూర్తి చేయడానికి సాధారణంగా 4-5 గంటలు పడుతుంది.

(8 / 8)

రాజ్‌మచి ఫోర్ట్ ట్రెక్: ఇది మహారాష్ట్రలో ఉంది. రాజ్‌మచి సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడ పర్వతంపై ఒక చరిత్రాత్మకమైన కోట ఉంది.  ఈ ట్రెక్ సుమారు 10 కి.మీ.లు ఉంటుంది. అంతా కాలిబాటనే. ట్రెక్ పూర్తి చేయడానికి సాధారణంగా 4-5 గంటలు పడుతుంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు