World Cup: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ రోజు మందు ప్రియులకు షాక్; డ్రై డే గా ప్రకటించిన ప్రభుత్వం
World Cup: మద్యం ప్రియులకు ఢిల్లీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ జరిగే ఆదివారం రోజును ఢిల్లీలో డ్రై డే గా ప్రకటించింది. ఆ రోజు ఢిల్లీలో మద్యం అమ్మకాలు ఉండవని స్పష్టం చేసింది.
Delhi dry day: ఇండియా, ఆస్ట్రేలియాల వరల్డ్ కప్ ఫైనల్ ను మద్యంతో హ్యాప్పీగా ఎంజాయ్ చేద్దామనుకున్న ఢిల్లీవాసులకు ప్రభుత్వం గట్టి షాక్ నే ఇచ్చింది. ఆ రోజు ఢిల్లీలో మద్యం అమ్మకాలు ఉండవని స్పష్టం చేసింది.
కారణం ఏంటంటే..
ఛాత్ పూజ (Chhath Puja) దీపావళి తరువాత వచ్చే పండుగ. దీన్నే సూర్య షష్టి అని కూడా అంటారు. బిహార్, యూపీ, ఢిల్లీ సహా ఉత్తర భారతంలో ఈ రోజు సూర్యుడిని పూజిస్తారు. ఆ రోజు ఉపవాసం కూడా ఉంటారు. ఛాత్ పూజ కోసం ఢిల్లీలో 900 ఘాట్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నవంబర్ 18 నుంచి రెండు రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు.
డ్రై డే
అందువల్ల ఆ రోజును ఢిల్లీ ప్రభుత్వం డ్రై డే గా ప్రకటించింది. ఆ రోజు మద్యం దుకాణాలు మూసి ఉంటాయని, మద్యం అమ్మకాలు జరగవని తేల్చి చెప్పింది. అయితే, అదే రోజు, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్ కూడా జరుగుతోంది. ‘‘నవంబర్ 19, అంటే ఆదివారం, దేశ రాజధాని అంతటా మద్యం దుకాణాలు మూసివేయబడతాయి. మద్యం అమ్మకాలపై కూడా నిషేధం ఉంటుంది’’ అని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా ప్రపంచ కప్ సీజన్‌లో మద్యం అమ్మకాలు పెరుగుతాయి. కానీ, ఈ సంవత్సరం వరల్డ్ కప్ ఫైనల్ రోజు, అదీ వారాంతమైన ఆదివారం రోజు మద్యం అమ్మకాలను నగరంలో నిషేధించడంతో ఢిల్లీ వాసులు నిరాశలో మునిగిపోయారు.