Seventh Divorce case : 7సార్లు పెళ్లి- 7వసారి విడాకులు.. మహిళ తీరు చూసి న్యాయమూర్తి షాక్!
కర్ణాటకలో వెలుగు చూసిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను చుట్టేస్తోంది. ఓ మహిళ 7సార్లు పెళ్లి చేసుకుని, 7వసారి విడాకులకు అప్లై చేసింది. ఆ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి కూడా షాక్ అయ్యారు!
పెళ్లైన తర్వాత కొందరు మహిళలు నగలు, విలువైన వస్త్రాలు తీసుకుని భర్తల ఇళ్ల నుంచి పారిపోతున్న ఘటనలు నిత్యం వార్తల్లో కనిపిస్తుంటాయి. ఈ తరహా కేసులకు సంబంధించి పోలీసులు అనేక మందిని అరెస్ట్ కూడా చేశారు. కానీ ఇప్పుడు మీరు వినబోయే కేసు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. 7సార్లు పెళ్లి చేసుకున్న ఓ మహిళ 7వసారి విడాకులకు దరఖాస్తు చేసుకుంది! ఈ విషయం తెలిసిన తర్వాత న్యాయమూర్తి సైతం షాక్‌కు గురయ్యారు!
అసలేం జరిగిందంటే..
కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన జడ్జి విచారణ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ 7వ పెళ్లి ప్రస్తావన జడ్జి ముందుకు వచ్చింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని.. 'ఇతను మహిళ 7వ భర్తా?' అని అడిగారు. ముందు పెళ్లిళ్ల నుంచి బయటకు వచ్చేందుకు మాజీ భర్తల మీద సెక్షన్ 498ఏ కింద ఆ మహిళ కేసు వేసిందా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
దానికి బదులిచ్చిన న్యాయవాది.. "అవును. వివాహితపై హింసకు సంబంధించిన సెక్షన్ 498ఏ కింద గతంలో కూడా కేసులు వేసింది. అంతేకాదు మెయిన్టేనెన్స్ కూడా డిమాండ్ చేసింది," అని బదులిచ్చారు.
"ప్రతి భర్తతో ఎంత కాలం ఉంది?" అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు "ఆరు నెలల నుంచి ఏడాది తర్వాత విడాకులకు ఫైల్ చేసింది," అని జవాబు లభించింది. అంతేకాదు కేసు సెటిల్మెంట్ కోసం డబ్బులు కూడా అడిగేది అని న్యాయవాది చెప్పారు.
మహిళ ప్రవర్తనపై కర్ణాటక జడ్జి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. సదరు మహిళ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం మాజీ భర్తలను కూడా విచారణకు పిలిపించారని న్యాయమూర్తి ఆదేశించారు. కేసును తదుపరి విచారణకు వాయిదా వేశారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 7సార్లు పెళ్లి, 7వసారి విడాకులు తీసుకుంటున్న మహిళ గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్ అవుతున్నారు. చట్టం దుర్వినియోగం జరుగుతోందన్న కోణంలో విచారణ జరుపుతున్న న్యాయమూర్తిని ప్రశంసిస్తున్నారు.
ఇంకొందరు.. మహిళ ప్రవర్తనతో బాధితులుగా మారిన పురుషులకు మద్దతిస్తున్నారు.
"ఈ పని ఒక పురుషుడు చేసి ఉంటే.. కోర్టు మెట్లు దాటనిచ్చేవారు కాదు. వెంటనే తీసుకెళ్లి జైలులో వేసేవారు," అని కామెంట్లు చేస్తున్నారు.
న్యాయమూర్తి విచారణకు సంబంధించిన వైరల్ వీడియోని ఇక్కడ చూడండి :
భర్తలను వదిలేసి లవర్స్‌తో జంప్!
ఉత్తర్‌ప్రదేశ్‌లో నిత్యం చిత్రవిచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పథకాల దుర్వినియోగం విషయంలో యూపీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి బయటపడింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులను తీసుకుని, కొందరు మహిళలు వారి లవర్స్‌తో వెళ్లిపోయారు! ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీడియా కథనాల ప్రకారం యూపీ మహారాజ్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం