Pradhan Mantri Awas Yojana : ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులిస్తే.. భర్తలను వదిలేసి లవర్స్‌తో జంప్!
Pradhan Mantri Awas Yojana UP : ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కొందరు మహిళలు, వాారి లవర్స్‌తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వారి భర్తల ఫిర్యాదుతో యూపీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో నిత్యం చిత్రవిచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పథకాల దుర్వినియోగం విషయంలో యూపీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి బయటపడింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులను తీసుకుని, కొందరు మహిళలు వారి లవర్స్‌తో వెళ్లిపోయారు! ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది..
మీడియా కథనాల ప్రకారం యూపీ మహారాజ్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మొదటి ఇన్స్టాల్మెంట్ కింద రూ. 40వేలు తీసుకున్న వారిలో 11 మంది మహిళలు.. ఇంటికి వెళ్లకుండా, వారి లవర్స్‌తో వెళ్లిపోయారు. వారి భర్తలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడటం గమనార్హం.
మహారాజ్‌గంజ్ జిల్లాలో 2,350 మంది లబ్ధిదారులకు పీఎంఏవై పథకం కింద నిధులు అందాయి. కాగా తుథిబారి, శీత్లాపూర్, చటియా, రామ్‌నగర్, బకుల్ దిహా, ఖస్ర, కిషున్‌పూర్, మిథౌలీ గ్రామాలకు చెందిన 11మంది ఇళ్లు వదిలేసి లవర్స్‌తో వెళ్లిపోయారు.
ఈ ఘటనను అధికారులు తీవ్రంగా పరిగణించినట్టు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబధించిన రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌ని నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఈ 11 మంది వల్ల అనేక మంది సొంత ఇంటి కలలకు ఇప్పుడు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
పీఎంఏవై నిధులు తీసుకుని మహిళలు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం యూపీలో కొత్తేమీ కాదు! గతేడాది కూడా నలుగురు వివాహితులు ఇళ్లు వదిలేసి లవర్స్‌తో వెళ్లిపోయారు. రూ. 50వేల నగదు వారి బ్యాంక్ అకౌంట్లో పడిన మరుసటి రోజే, వారు ఇంట్లో నుంచి అదృశ్యమయ్యారు. డబ్బులిచ్చినా ఇళ్ల నిర్మాణం ఇంకా మొదలవ్వకపోవడంతో ఏం జరిగిందో కనుక్కోవడానికి అధికారులు వెళ్లిన అనంతరం ఈ వ్యవహారం బయటపడింది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలు, మధ్యతరగతి వారు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం నిధులిస్తుంది. సంబంధిత కుటుంబ ఆదాయాన్ని బట్టి రూ. 2.5లక్షల వరకు సబ్సిడీని అందిస్తుంది. ఏదైనా లోపాలు కనిపిస్తే, అధికారులు డబ్బులు తిరిగి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఏదేమైనా ప్రభుత్వ పథకాలతో వచ్చే డబ్బులను ఇలా దుర్వినియోగం చేస్తుండటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలని పలువురు అభిప్రాపడుతున్నారు.
సామూహిక వివాహాలు కూడా..
ప్రధానమంత్రి అవాస్ యోజన ఒక్కటే కాదు, ఇతర కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ పథకాల విషయంలోనూ యూపీలో ఇలాంటివే కనిపిస్తూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించే సామూహిక వివాహలు నిత్యం వార్తల్లో నిలుస్తాయి. పెళ్లి తర్వాత ఇచ్చే డబ్బులకు ఆశపడి, చాలా మంది వేదికల వద్దకు వచ్చి పెళ్లి చేసుకున్నట్టు నటిస్తూ ఉంటారు. ఇంకొదరైతే, వేషాలు మార్చుకుని మరీ లైన్లో నిలబడతారు.
ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు కొన్ని నెలల క్రితం ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. కఠిన చర్యలు చేపడతామని అధికారులు చెప్పినప్పటికీ, యూపీలో ఈ తరహా ఘటనలు సర్వ సాధారణంగా మారిపోయాయి.
సంబంధిత కథనం