UP Wedding Fraud : సామూహిక వివాహల్లోనూ స్కామ్- రూ. 500 ఇచ్చి, పెళ్లి పీటల మీద కూర్చోపెట్టారు!
Wedding Fraud UP viral video : యూపీలో సామూహిక వివాహాల పేరుతో పెద్ద స్కామే జరిగింది! డబ్బులిచ్చి, ఈవెంట్‌కు తీసుకొచ్చి.. పెళ్లి చేయించారట. అసలు ఏం జరిగిందంటే..
Balia Wedding Fraud : ఉత్తర్ ప్రదేశ్‌లో.. సామూహిక వివాహాల పేరుతో జరిగిన ఓ పెద్ద స్కామ్ తాజాగా బయపడింది. బాలియా జిల్లాలో జరిగిన ఈ సామూహిక వివాహాల వేడుకలో.. పురుషులు లేకుండానే, మహిళలు.. వారికి వారే వరమాలలు వేసుకుని, పెళ్లి జరిగిపోయినట్టు అనేసుకున్నారు! వారిలో చాలా మందికి డబ్బులు ఇచ్చి అక్కడికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
యూపీలో భారీ వెడ్డింగ్ స్కామ్..
ఉత్తర్ ప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో జనవరి 25న జరిగింది ఈ ఘటన. ఆ ఈవెంట్లో 568 జంటలు పెళ్లి చేసుకున్నట్టు తొలుత అధికారులు చెప్పారు. కానీ.. అదొక స్కామ్ అని తర్వాత తెలిసింది.
వధూవరులుగా నటించేందుకు.. ప్రజలకు డబ్బులిచ్చి మరీ అక్కడికి తీసుకెళ్లారట! రూ. 500 నుంచి రూ. 2వేల వరకు చేతికి ఇచ్చారని సమాచారం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. ఆ వేడుకలో ఒక చోట.. పురుషులు లేక.. చాలా మంది వారి మీద వారే వరమాలలు వేసేసుకున్నారు. ఇంకో చోట.. పురుషులే, వధువు ధరించి కట్టుకుని కనిపించారు.
Wedding Fraud in UP : ఈవెంట్లో పాల్గొన్న ఓ 19ఏళ్ల యువకుడితో ఓ ప్రముఖ వార్తాసంస్థ మాట్లాడింది.
"పెళ్లి చూడటానికి ఆ రోజు నేను అక్కడికి వెళ్లాను. కానీ నన్ను కూడా కూర్చోబెట్టేశారు! డబ్బులిస్తామని అన్నారు. నన్నే కాదు.. చాలా మందిని అలాగే కూర్చోబెట్టారు," అని ఆ యువకుడు చెప్పాడు.
ఈ సామూహిక వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ ఎమ్మెల్యే కేట్కి సింగ్. అసలు విషయం బయటపడటంతో.. స్కామ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
UP wedding fraud viral video : ఈ నేపథ్యంలో.. యూపీలో సామూహిక వివాహాల పేరిట జరిగిన స్కామ్‌కు సంబంధించి.. ఇద్దరు అధికారులతో పాటు 15మందిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ విషయంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి, వెంటనే దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు చెప్పారు.
ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. సామూహిక వివాహాలకు సంబంధించిన స్కీమ్‌లో భాగంగా లబ్ధిదారులకు రూ. 51వేలు అందుతాయి. వీటిల్లో రూ. 35వేలు మహిళలకు, రూ. 10వేలు పెళ్లి సామాగ్రి కొనేందుకు, రూ. 6వేలు ఈవెంట్‌కి వెళతాయి.
అయితే.. తాజా స్కామ్ నేపథ్యంలో.. అసలైన లబ్ధిదారులకు కూడా నగదును నిలిపివేసినట్టు తెలుస్తోంది. దర్యాప్తు ముమ్మరంగా చేపట్టి నివేదిక బయటకి వచ్చిన తర్వాతే.. లబ్ధిదారులకు నిధులు అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
సంబంధిత కథనం