Rare Divorce Case : నెలకోసారి స్నానం చేస్తున్న భర్త.. ఈ మెుగుడు నాకొద్దంటూ విడాకులు కోరిన భార్య-woman seeks divorce as husband doesnt bathe daily relies on gangajal for hygiene in agra ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rare Divorce Case : నెలకోసారి స్నానం చేస్తున్న భర్త.. ఈ మెుగుడు నాకొద్దంటూ విడాకులు కోరిన భార్య

Rare Divorce Case : నెలకోసారి స్నానం చేస్తున్న భర్త.. ఈ మెుగుడు నాకొద్దంటూ విడాకులు కోరిన భార్య

Anand Sai HT Telugu

Rare Divorce Case In Agra : ఒక మహిళ తన భర్త విచిత్రమైన స్నానపు అలవాట్ల కారణంగా విడాకులు కోరింది. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. పెళ్లైన 40 రోజుల తర్వాత విడాకుల కోసం దరఖాస్తు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక మహిళ తన వివాహమైన ఒక నెల తర్వాత విడాకులు కోరింది. అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తే.. విచిత్రమైన సమాధానం చెప్పింది. తన భర్త రాజేశ్ అపరిశుభ్రత కారణంగా విడాకులు కోరుతున్నట్టుగా తెలిపింది. భర్త క్రమం తప్పకుండా స్నానం చేయడని పేర్కొంది.

రాజేశ్ అనే వ్యక్తి నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తాడు. అతని భార్య తట్టుకోలేని శరీర దుర్వాసనతో విడాకులు కోరినట్టుగా తెలుస్తోంది. పెళ్లయిన నలభై రోజుల తర్వాత ఆ మహిళ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాజేశ్ స్నానం చేయకపోవడంపై మహిళ.. తన భర్తను చాలాసార్లు ప్రశ్నించింది.

గంగాజలాన్ని రాజేశ్ వారానికి ఒకసారి చల్లుకుంటాడు. అయితే పెళ్లయిన తర్వాత భార్య పట్టుబట్టడంతో 40 రోజుల వ్యవధిలో ఆరుసార్లు స్నానం చేశాడని ఇండియా టుడే తెలిపింది. దీంతో ఆ మహిళ విసిగిపోయింది. భర్త ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని కోపానికి వచ్చింది.

అయితే ఆ మహిళ కుటుంబం వరకట్న వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది, విడాకులు కోరింది. అయితే కౌన్సెలింగ్‌లో భాగంగా స్నానానికి సంబంధించిన విషయాలు చెప్పింది. అప్పటికి భర్తతో గొడవ పడి భార్య తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది. భర్త చివరికి పశ్చాత్తాపం చెందాడు. తన వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపరచడానికి అంగీకరించాడు. అయితే ఆ మహిళ అతడితో ఇక జీవించడం ఇష్టం లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది. కౌన్సెలింగ్ సెంటర్‌కు రావాలని అధికారులు చెప్పారు.

గతంలోనూ విచిత్రమైన కేసు

ఇలాంటి విచిత్రమైన విడాకుల కేసు ఈ సంవత్సరం ప్రారంభంలో ఆగ్రాలో మరొకటి జరిగింది. కొన్ని నెలల క్రితం ఒక మహిళ తన భర్తతో విడాకులు కోరింది. అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తే.. తనకు చిప్స్ ప్యాకెట్స్ తీసుకురావడం లేదని చెప్పింది. చిప్స్ ప్యాకెట్స్‌కు ఆ మహిళ బానిసైంది. తన భర్తను ప్రతిరోజూ 5 ప్యాకెట్లు తీసుకురావాలని అడిగేది. ఇది వివాదాలకు దారితీసింది. ఒక రోజు తన భార్యకు ఇష్టమైన చిరుతిండిని తీసుకురావడం అతడు మరిచిపోయాడు. దీంతో ఆమె విడాకులు కోరింది.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.