Bengaluru rains: జూలై 8 వరకు బెంగళూరులో భారీ వర్షాలు; కర్నాటక వ్యాప్తంగా జూలై 12 వరకు..-widespread rain expected in bengaluru till july 8 other areas till midjuly ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Rains: జూలై 8 వరకు బెంగళూరులో భారీ వర్షాలు; కర్నాటక వ్యాప్తంగా జూలై 12 వరకు..

Bengaluru rains: జూలై 8 వరకు బెంగళూరులో భారీ వర్షాలు; కర్నాటక వ్యాప్తంగా జూలై 12 వరకు..

HT Telugu Desk HT Telugu
Jul 05, 2024 01:46 PM IST

Bengaluru rains: కర్నాటక వ్యాప్తంగా జూలై 12 వరకు భారీ వర్షాలు కురుస్తాయని కర్నాటక రాష్ట్ర ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ కేంద్రం (KSNDMC), స్థానిక వాతావరణ అధికారులు తెలిపారు. బెంగళూరు నగరం, శివారు ప్రాంతాల్లో జూలై 8వ తేదీ వరకు విస్తారంగా వానలు కురుస్తాయని వెల్లడించారు.

జూలై 8 వరకు బెంగళూరులో భారీ వర్షాలు
జూలై 8 వరకు బెంగళూరులో భారీ వర్షాలు

Bengaluru rains: జూలై 12 వరకు కర్నాటక రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని కర్నాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ కేంద్రం (KSNDMC) అంచనా వేసింది. బెంగళూరు అర్బన్ జిల్లాలో జూలై 8 వరకు స్థిరమైన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. జూలై నెల ప్రారంభమైననాటి నుంచి కోస్తా, పశ్చిమ కనుమల ప్రాంతాల్లో ఇప్పటికే గణనీయమైన వర్షపాతం నమోదైందని బెంగళూరులోని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ సిఎస్ పాటిల్ తెలిపారు. జూలై 3న ఒక్క రోజే అగుంబేలో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. దీనికి భిన్నంగా, సాధారణంగా ఈ కాలంలో అధిక వర్షపాతం నమోదయ్యే మలేనాడు జిల్లాలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు.

అఘనాశిని నది ఉగ్రరూపం

ఉత్తర కన్నడలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో అఘనాశిని నది పూర్తిస్థాయి నీటిమట్టంతో ప్రవహిస్తోంది. బెంగళూరు (Bengaluru) ఉత్తర, వాయవ్య ప్రాంతాలు ఈ రోజు మేఘావృతమై, కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం నుంచి వైట్ ఫీల్డ్ వంటి ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడుతోంది. ఉడిపి, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాలకు ఐఎండీ (IMD) ఆరెంజ్ అలర్ట్, బెళగావి, ధార్వాడ్, కొడగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ తన రోజువారీ వాతావరణ బులెటిన్లో పేర్కొంది.

Whats_app_banner