Hyderabad rain alert : నైరుతి రుతుపవనాల ప్రభావంతో దక్షిణ భారతంంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. కేరళ, కర్ణాటక, గోవాలో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆయా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో పాటు ఒడిశాకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు ఇచ్చింది ఐఎండీ.
కాగా.. ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో మాత్రం భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఈ రోజు వడగాల్పులు వీస్తాయని సూచిస్తూ ఉత్తర ప్రదేశ్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. నైరుతి రుతుపవనాలు రాబోయే మూడు రోజుల్లో ఈ ప్రాంతానికి ఉపశమనం కలిగిస్తాయని తెలిపింది.
Rains in Andhra Pradesh : జూన్ 25 నాటికి గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు మరింత పురోగతి సాధించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది.
Telangana rains : కానీ.. ఉత్తరప్రదేశ్లో జూన్ 24 వరకు, జమ్ములో జూన్ 23 నుంచి 25 వరకు వడగాల్పులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. పేర్కొన్న తేదీల తర్వాత ఈ ప్రాంతాల్లో వడగాలులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఏపీకి కూడా ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. తాజా వెదర్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం