IMD alert : ఉత్తర భారతంలో భానుడి భగభగలు- ఈశాన్యం, దక్షిణాన జోరుగా వర్షాలు..
IMD alert రుతుపవనాలు ముందుకు సాగడంతో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. జూన్ 19 నుంచి ముంబై, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది.
Telangana rain alert : రానున్న మూడు రోజుల్లో పశ్చిమ బెంగాల్, అసోం-మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అదే సమయంలో రానున్న రెండు రోజుల్లో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈశాన్య అసోంలో వాయుగుండం ఏర్పడిందని, ఉత్తర బిహార్ నుంచి పశ్చిమ బెంగాల్ గంగా నది తీర ప్రాంతం, దక్షిణ ప్రాంతాల వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతం నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తన తాజా బులెటిన్‌లో పేర్కొంది.
ఈ రాష్ట్రాల్లో వడగాల్పులు..
మరోవైపు.. ఉత్తర భారతంలో మాత్రం హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. జూన్ 18 నుంచి జూన్ 19 వరకు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో, జూన్ 18న పంజాబ్, హరియాణా-ఛండీగఢ్-దిల్లీ, జూన్ 18న హిమాచల్ ప్రదేశ్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
Rains in Hyderabad : జూన్ 18న జమ్ముకశ్మీర్, ఉత్తర మధ్యప్రదేశ్, ఉత్తర కోస్తాంధ్ర, జూన్ 18 నుంచి జూన్ 19 వరకు ఉత్తర రాజస్థాన్‌లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
జూన్ 18 నుంచి 19 వరకు ఒడిశా, జూన్ 18న పశ్చిమబెంగాల్, జూన్ 20న ఝార్ఖండ్‌లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుంది.
ఇక్కడ భారీ వర్షాలు..
రానున్న ఐదు రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు (గంటకు 30-40 కిలోమీటర్లు) కురిసే అవకాశం ఉంది.
Rain alert in Andhra Pradesh : జూన్ 18 నుంచి జూన్ 21 వరకు ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 18 నుంచి జూన్ 19 వరకు నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, జూన్ 18 నుంచి జూన్ 19 వరకు అసోం, మేఘాలయ, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. జూన్ 19న అరుణాచల్ ప్రదేశ్, జూన్ 18న మేఘాలయలో భారీ వర్షాలు కురిశాయి.
రానున్న రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు (గంటకు 30-40 కిలోమీటర్లు) కురిసే అవకాశం ఉంది.
2024 జూన్ 20, 21 తేదీల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రుతుపవనాల అంచనాలు..
నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తాంధ్ర, వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన ప్రాంతాలు, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలకు వచ్చే నాలుగు రోజుల్లో విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
సోమవారం రుతుపవనాలు మరింత ముందుకు సాగడంతో ముంబై, దాని పరిసర జిల్లాల్లో జూన్ 19 నుంచి వర్షాలు పెరిగే అవకాశం ఉంది.
సంబంధిత కథనం