పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ అంచనా వేసింది.
(1 / 6)
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది
(2 / 6)
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరో మూడు నాలుగు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ విడుదల చేసింది.
(Photo Source @APSDMA Twitter)(3 / 6)
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం.. ఇవాళ(జూన్ 21) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.
(Photo Source @APSDMA Twitter)(4 / 6)
ఇక ఆదివారం(జూన్ 23) రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(5 / 6)
ఇక ఏపీలో చూస్తే నైరుతి రుతుపవనాలు జూన్ 2న ఏపీలో ప్రవేశించాయి. అయితే ఇవి జూన్ 20, 2024 నాటికి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
(6 / 6)
రుతుపవనాలతో పాటు ఆవర్తన ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ
ఇతర గ్యాలరీలు