Russia changes key aim of Ukraine war: ఉక్రెయిన్ తో యుద్ధంలో మారిన రష్యా స్వరం-vladimir putin backs down on this key aim of ukraine war not in our sights ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russia Changes Key Aim Of Ukraine War: ఉక్రెయిన్ తో యుద్ధంలో మారిన రష్యా స్వరం

Russia changes key aim of Ukraine war: ఉక్రెయిన్ తో యుద్ధంలో మారిన రష్యా స్వరం

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 10:08 PM IST

Russia changes key aim of Ukraine war: ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై, ప్రపంచ ఆహార భద్రతపై పెను ప్రభావం చూపుతున్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine war) రష్యాకు భారీ పాఠాలే నేర్పిస్తోంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (ఫైల్ ఫొటో)
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (ఫైల్ ఫొటో) (AFP)

Russia Ukraine war: ఉక్రెయిన్ తో యుద్ధం రష్యాకు చాలా గుణ పాఠాలనే నేర్పిస్తోంది. ఉక్రెయిన్ నుంచి ఊహించని ప్రతిఘటన, స్వపక్షంలో కొనసాగుతున్న భారీ ప్రాణ నష్టం.. ఈ యుద్ధం విషయంలో రష్యా ఆత్మ విమర్శ చేసుకునే పరిస్థితి కల్పిస్తోంది.

Russia's key aim of Ukraine war: ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలుస్తాం..

ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్(Russia Ukraine war) ప్రారంభించిన సమయంలో.. ఈ యుద్ధం సాధించాల్సిన కొన్ని లక్ష్యాలను రష్యా బహిరంగంగానే వెల్లడించింది. అందులో ఒకటి ఉక్రెయిన్ లో అధికార మార్పిడి. ప్రస్తుతం ఉక్రెయిన్ లో అధికారంలో ఉన్న జెలెన్ స్కీ ప్రభుత్వాన్ని కూల్చి, తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ మిలటరీ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని పేర్కొంది. అలాగే, రష్యన్ భాషను ఎక్కువగా మాట్లాడే ప్రాంతాలైన తూర్పు డాన్బాస్ తదితర ప్రాంతాల పరిరక్షణ కూడా తమ లక్షమని పేర్కొంది.

Russia changes key aim of Ukraine war: కీలక లక్ష్యం విషయంలో వెనుకడుగు

అయతే, తాాజగా, ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సంబంధించిన తమ లక్ష్యంపై రష్యా వెనుకడుగు వేసింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చడం ప్రస్తుతం తమ ప్రధాన లక్ష్యం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ఆలోచన తమకు లేదని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. ఉక్రెయిన్ లో ప్రభుత్వ మార్పు తమ మిలటరీ ఆపరేషన్(Russia Ukraine war) లక్ష్యం కాదని ఆయన వివరించారు.

Russia's wrong strategy: తక్కువ అంచనా వేశారా?

ఉక్రెయిన్ తో యుద్ధం(Russia Ukraine war)లో అనూహ్య వైఫల్యాలే ఈ రష్యా వెనుకడుగుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మిలటరీ ఆపరేషన్ ప్రారంభించిన సమయంలో.. కొద్ది రోజుల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని, ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ విదేశాలకు పారిపోవడమో, లేక రష్యాకు లొంగిపోవడమో జరుగుతుందని రష్యా భావించింది. ఉక్రెయిన్ ప్రతిఘటనను సరిగ్గా అంచనా వేయలేకపోయింది. మరోవైపు, ఉక్రెయిన్ దళాల పోరాట పటిమకు తోడు, అమెరికా, యూరోప్ దేశాలు ఉక్రెయిన్ కు అందిస్తున్నపరోక్ష సహకారం ఆ దేశానికి కలిసివస్తోంది. ఈ యుద్ధంలో రష్యా దళాలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, తన కీలక లక్ష్యం విషయంలో రష్యా వెనుకడుగు వేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

WHO warns: ముప్పు ముందుంది

మరోవైపు, ఈ యుద్ధం(Russia Ukraine war) కారణంగా ఉక్రెయిన్ లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. అందువల్ల ఈ శీతాకాలం సీజన్లో ఉక్రెయిన్ లో చలిని, శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునే సరైన వసతులు లేని కారణంగా లక్షల సంఖ్యలో మరణాలు చోటు చేసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization- WHO) హెచ్చరించింది. ఇప్పటికే ఉక్రయెన్ జనాభాలో నాలుగో వంతు ప్రజలకు విద్యుత్ సౌకర్యం నిలిచిపోయిన విషయాన్ని గుర్తు చేసింది. విద్యుత్ సంక్షోభం, ఒత్తిడి వల్ల ఎదురయ్యే మానసిక సమస్యలు, మానవతా సాయం అందించడంలో ఎదురవుతున్న అడ్డంకులు.. తదితర కారణాలతో ఉక్రెయిన్ లో పెద్ద ఎత్తున మరణాలు సంభవించే ప్రమాదముందని హెచ్చరించింది.

Whats_app_banner

టాపిక్