UPSC Civil Services Exam 2022: సివిల్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల-upsc civil services exam 2022 personality test schedule released at upscgovin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Civil Services Exam 2022: సివిల్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల

UPSC Civil Services Exam 2022: సివిల్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల

HT Telugu Desk HT Telugu
Feb 10, 2023 10:35 PM IST

UPSC Civil Services Exam 2022: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించడానికి తేదీలను నిర్ణయించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

UPSC Civil Services Exam 2022: ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష మూడు అంచెల్లో జరుగుతుంది. మొదట ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. ఆ తరువాత డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ ఉంటుంది. ఆ తరువాత మెయిన్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ (personality test) ఉంటుంది.

UPSC Civil Services Exam 2022: ఇంటర్వ్యూ తేదీలివే..

2022 సంవత్సరానికి గానూ జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో మెయిన్స్ ఫలితాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. మెయిన్స్ లో ఉత్తీర్ణులైన 918 మంది అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ ను నిర్వహించడానికి యూపీఎస్సీ (UPSC) షెడ్యూల్ ను సిద్ధం చేసింది. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు యూపీఎస్సీ (UPSC) అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ను సందర్శించాలి. యూపీఎస్సీ వెబ్ సైట్లో పొందుపర్చిన నోటిఫికేషన్ ప్రకారం.. 2022 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ లో ఉత్తీర్ణులైన 918 మందికి 2023 మార్చి 13 నుంచి ఇంటర్వ్యూలు (personality test) ప్రారంభమవుతాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్స్ లో జరిగే ఈ ఇంటర్వ్యూలు ఏప్రిల్ 21 నాటికి ముగుస్తాయి.

UPSC Civil Services Exam 2022: e-Summon Letters: ఈ- సమన్ లెటర్స్ ఆన్ లైన్ లో

2022 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ లో ఉత్తీర్ణులైన 918 మందికి ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వివరాలతో ఈ- సమన్ లెటర్స్ ( e-Summon Letters) ను త్వరలో అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లో అప్ లోడ్ చేయనున్నారు. ఆ తరువాత వాటిని అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ (personality test) సమయాన్ని కానీ, తేదీని కానీ మార్చే అవకాశం లేదని యూపీఎస్సీ (UPSC) స్పష్టం చేసింది. ఉదయం సెషన్ కు ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులు ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే, మధ్యాహ్నం సెషన్ కు ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులు మధ్యాహ్నం 1 గంటకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు (personality test) హాజరు కావడం కోసం ఢిల్లీ వస్తున్న అభ్యర్థులకు ప్రయాణ ఖర్చులు ఇస్తారు. వారికి ట్రైన్ లో Second/ Sleeper class train fare (Mail Express)లో ప్రయాణించడానికి అవసరమైన చార్జీలను అందజేస్తారు. అలాగే, నిర్ధారిత సమయంలోగా DAF II ను సబ్మిట్ చేయని వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని యూపీఎస్సీ (UPSC) స్పష్టం చేసింది.

IPL_Entry_Point