UPSC Civil Services: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ వచ్చింది.. చూశారా?
UPSC Civil Services: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1105 పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ (Union Public Service Commission UPSC) ఏటా జనవరి లేదా ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అలాగే, 2023 సంవత్సరానికి కూడా మొత్తం 1105 పోస్ట్ ల భర్తీకి యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష నోటిఫికేషన్ (UPSC Civil Services Exam 2023) ను విడుదల చేసింది.
UPSC Civil Services Exam 2023: లాస్ట్ డేట్..
యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ కు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 21. ఇప్పటికే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లో (UPSC Civil Services Exam 2023) డిటైల్డ్ నోటిఫికేషన్ ను చూడవచ్చు. అలాగే, ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు కూడా ఈ యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ద్వారా లేదా upsconline.nic.in ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. 2023 సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1న ప్రారంభమై, ఫిబ్రవరి 21 తో ముగుస్తుంది. తరువాత, అప్లికేషన్ ఫామ్ లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే, ఆ అవకాశం ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది.
UPSC Civil Services Exam 2023: మేలో ప్రిలిమ్స్
సివిల్ సర్వీసెస్ (UPSC Civil Services Exam 2023) ఉద్యోగుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. మొదట ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. మెయిన్స్ క్లియర్ చేసిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. 2023 సంవత్సరానికి ప్రిలిమ్స్ పరీక్షను మే 28న నిర్వహించనున్నారు. సివిల్స్ (UPSC Civil Services Exam 2023) పరీక్ష రాయడానికి అభ్యర్థులు కనీసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే, వారి వయస్సు ఆగస్ట్ 1, 2023 నాటికి 21 సంవత్సరాల నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ తో పాటు రూ. 100 ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజును ఎస్పీఐ లో కానీ, లేదా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ విధానాల ద్వారా కానీ చెల్లించవచ్చు . ఆ వివరాలు upsconline.nic.in. వెబ్ సైట్ లో ఉంటాయి.
UPSC Civil Services Exam 2023: అప్లై చేయడం ఎలా?
- యూపీఎస్సీ (UPSC) అధికారిక వెబ్ సైట్ upsc.gov.in.లోకి వెళ్లాలి.
- హోం పేజీపై కనిపించే వాట్స్ న్యూ (Whats New) సెక్షన్ లో ఉన్న UPSC Civil Services Exam 2023 లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఓపెన్ అవుతుంది.
- ఆ లింక్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఉన్నపేజీ ఓపెన్ అవుతుంది.
- డిటైల్స్ నింపి, రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటే లాగిన్ డిటైల్స్ ను ఫిల్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
- అప్లికేషన్ ఫామ్ నింపి, ఫీ చెల్లించాలి. మినహాయింపు పొందినవారు ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు.
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
టాపిక్