Twitter India layoffs : ట్విట్టర్​ ఇండియాలో భారీగా ఉద్యోగాల కోత..!-twitter starts laying off staff in india marketing and communications departments sacked ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Twitter Starts Laying Off Staff In India, Marketing And Communications Departments Sacked

Twitter India layoffs : ట్విట్టర్​ ఇండియాలో భారీగా ఉద్యోగాల కోత..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 04, 2022 06:51 PM IST

Twitter India layoffs : ట్విట్టర్​ ఇండియాలోనూ ఉద్యోగాల కోత మొదలైంది! రెండు విభాగాలను పూర్తిగా తీసేయడంతో పాటు మరికొంత మంది ఉద్యోగులు జాబ్స్​ కోల్పోయినట్టు సమాచారం.

ట్విట్టర్​ ఇండియాలోనూ ఉద్యోగాల కోత..!
ట్విట్టర్​ ఇండియాలోనూ ఉద్యోగాల కోత..! (AP)

Twitter India layoffs : ఇండియాకు కూడా ట్విట్టర్ 'ఉద్యోగాల కోత' సెగ తాకింది! ట్విట్టర్​ ఇండియా ఉద్యోగుల్లో కొందరికి ఈమెయిల్స్​ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆఫీసులకు తిరిగి రావద్దని ఆ మెయిల్స్​లో ఉన్నట్టు సమచారం.

ట్రెండింగ్ వార్తలు

కాగా.. మార్కెటింగ్​, కమ్యూనికేషన్స్​ డిపార్ట్​మెంట్​లను పూర్తిగా తొలగించినట్టు, అందులోని ఉద్యోగులతో పాటు పలువురు ఇంజనీర్స్​ను జాబ్స్​ నుంచి తప్పించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.

Twitter layoffs news :"ఉద్యోగాల కోత మొదలైంది. కొంతమందికి ఈమెయిల్స్​ వచ్చాయి. ఈ ఉద్యోగుల తొలగింపు గురించి అందులో ఉంది," అని ట్విట్టర్​ ఇండియా ఉద్యోగి ఒకరు మీడియాకు చెప్పారు. ఈ ఉద్యోగాల కోత ప్రభావం.. ట్విట్టర్​ ఇండియాపై కాస్త ఎక్కువగానే పడినట్టు మరో ఉద్యోగి చెప్పుకొచ్చారు.

ట్విట్టర్ ఇండియాలో దాదాపు 250మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు అందరిని తొలగించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే.. ట్విట్టర్​ ఇండియాలో ఉద్యోగాల కోతపై ఇంకా పూర్తి స్పష్టత లేదు. కాగా.. ఈ విషయంపై ట్విట్టర్​ ఇండియా కూడా ఇంకా స్పందించలేదు. 

'ఇళ్లకు తిరిగి వెళ్లిపోండి..'

Elon Musk twitter layoffs : 6 నెలల ఉత్కంఠకు తెరదించుతూ.. కొన్ని రోజుల క్రితమే ట్విట్టర్​ను అధికారికంగా సొంతం చేసుకున్నారు అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​. వస్తూనే పూర్తిస్థాయి ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ట్విట్టర్​ సీఈఓ పరాగ్​ అగర్వాల్​తో పాటు అనేకమంది సీనియర్లను సంస్థను తప్పించారు. బ్లూ టిక్​ కోసం నెలకు 8డాలర్లు చెల్లించాలని నిబంధన తీసుకొచ్చారు.

ఇక ఉద్యోగాల కోతపై ఎలాన్​ మస్క్​ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాస్ట్​ కటింగ్​, సంస్థ వృద్ధి పేరుతో.. భారీ సంఖ్యలో ఉద్యోగాలను కట్​ చేయాలని ఎలాన్​ మస్క్​ ఫిక్స్​ అయ్యారు. ఫలితంగా ఇండియాతో పాటు అంతర్జాతీయంగా ఉన్న ట్విట్టర్​ కార్యాలయాలు ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా.. అమెరికాలో చాలా మందికి ఇప్పటికే ఈమెయిల్స్​ అందాయి. ఇక ఆఫీసుకు రావొద్దంటూ ఈ మెయిల్స్​ స్పష్టం చేశాయి. ఇక కంపెనీ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు తెలుస్తోంది. కంపెనీ భవితవ్యంపై స్పష్టత వచ్చిన తర్వాత ఆఫీసును తిరిగి తెరిచే అవకాశం ఉందని సమాచారం.

"మీరు ఆఫీసుకు వచ్చే దారిలో ఉన్నా.. ఆఫీసులో ఉన్నా.. దయచేసి తిరిగి ఇంటికి వెళ్లిపోండి. ‘ట్విటర్‌ను ఆరోగ్యకరమైన మార్గంలో పెట్టేందుకు కంపెనీ ఉద్యోగులను తగ్గించే కష్టమైన ప్రక్రియను అనుసరిస్తున్నాంము", అని గురువారం ట్విటర్ తన ఉద్యోగులకు మెయిల్ చేసింది.

వాస్తవానికి ట్విట్టర్​లో ఉద్యోగాల కోతను ఉద్యోగులు ముందే పసిగట్టారు. ఈ నేపథ్యంలో అనేకమంది.. కొన్ని నెలల క్రితమే ట్విట్టర్​ను విడిచి వెళ్లిపోయారు. మిగిలిన వారు అయోమయంలో పడ్డారు. 

IPL_Entry_Point

సంబంధిత కథనం