Twitter layoffs begin: ‘మీరు దారిలో ఉన్నా.. ఆఫీసులో ఉన్నా ఇంటికి వెళ్లిపోండి..’-if you are in office or on your way please twitter says as layoffs begin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Twitter Layoffs Begin: ‘మీరు దారిలో ఉన్నా.. ఆఫీసులో ఉన్నా ఇంటికి వెళ్లిపోండి..’

Twitter layoffs begin: ‘మీరు దారిలో ఉన్నా.. ఆఫీసులో ఉన్నా ఇంటికి వెళ్లిపోండి..’

HT Telugu Desk HT Telugu
Nov 04, 2022 11:29 AM IST

Twitter layoffs begin: ట్విటర్‌లో ఉద్యోగాల కోత మొదలైంది. సగం మంది ఉద్యోగులు ఇక ఇంటి దారి పట్టాల్సిందేనని ట్విటర్ ఈరాత్రికి హెచ్చరించనుంది.

ట్విటర్‌లో ఉద్యోగాల కోత మొదలైంది
ట్విటర్‌లో ఉద్యోగాల కోత మొదలైంది

ట్విటర్‌లో ఉద్యోగాల కోత మొదలైంది. ఉద్యోగం ఊడితే ఆ సంగతి తెలుపుతూ ఆయా ఉద్యోగులకు కంపెనీ ఈమెయిల్ ద్వారా ఆ సంగతి తెలపనుంది.

అంతేకాకుండా తమ కార్యాలయాలను తాత్కాలికం మూసివేస్తున్నామని, సిబ్బందికి యాక్సెస్ ఉండదని కూడా తెలియపరచనుంది. కంపెనీ భవితవ్యంపై వారం రోజుల పాటు అనిశ్చితి నెలకొన్న అనంతరం తాజా పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి.

ట్విటర్ తన ఉద్యోగులకు ఈమేరకు ఓ మెయిల్ పంపింది. ఉద్యోగాల కోతకు సంబంధించిన విషయం ఉదయం 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9.30 గంటలకు) అలెర్ట్ చేయనున్నట్టు మెయిల్ చేసింది.

‘మీరు ఒకవేళ ఆఫీసుకు వచ్చే దారిలో ఉన్నా.. ఆఫీసులో ఉన్నా.. దయచేసి మీరు తిరిగి ఇంటికి వెళ్లండి..’ అని గురువారం ట్విటర్ తన ఉద్యోగులకు మెయిల్ చేసింది.

‘ట్విటర్‌ను ఆరోగ్యకరమైన మార్గంలో పెట్టేందుకు కంపెనీ ఉద్యోగులను తగ్గించే కష్టమైన ప్రక్రియను అనుసరిస్తున్నాం..’ అని కంపెనీ తన ఉద్యోగులకు మెయిల్ చేసినట్టు రాయిటర్స్ తెలిపింది.

కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తామని, ఉద్యోగుల బ్యాడ్జెస్‌కు యాక్సెస్ నిలిపివేస్తామని ట్విటర్ తెలిపింది. ‘ప్రతి ఉద్యోగి భద్రత, ట్విటర్ సిస్టమ్స్, కస్టమర్ డేటా భద్రత కోసం’ ఈ చర్య తీసుకుంటున్నట్టు తెలిపింది.

తొలగింపు ప్రక్రియతో ప్రభావితం కాని ఉద్యోగులకు కూడా ఈమెయిల్ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. వేటు పడిన ఉద్యోగులు అనుసరించాల్సిన తదుపరి స్టెప్స్ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్‌కు పంపనున్నట్టు ట్విటర్ తెలిపింది.

గత శుక్రవారమే ట్విటర్‌ను తన చేతుల్లోకి తీసుకున్న ఇలాన్ మస్క్ ఇప్పటికే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, డైరెక్టర్లను తొలగించారు.

ఇలాన్ మస్క్ ట్విటర్‌లో దాదాపు 3,700 మంది ఉద్యోగులను అంటే సగం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు బ్లూమ్‌బెర్గ్ ఏజెన్సీ నిన్ననే ఒక వార్త వెలువరించింది.

అలాగే ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఇక కార్యాలయాల దారి పట్టాల్సిందేనని, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పాలసీని రద్దు చేస్తున్నట్టు ట్విటర్ తన ఉద్యోగులకు మెయిల్ చేయనుందని కూడా సదరు వార్తా ఏజెన్సీ తెలిపింది.

Whats_app_banner