Toyota Land Cruiser : టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఫీచర్స్ ఇవే..!
Toyota Land Cruiser : టయోటా ల్యాండ్ క్రూయిజర్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ వివరాలు..
Toyota Land Cruiser : సరికొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్.. దేశంలో లాంచ్‌కి సన్నద్ధమవుతోంది. తాజాగా.. ఈ ఫోర్ వీలర్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. వాటిని ఓసారి పరిశీలిద్దాము.
టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఫీచర్స్ ఇవే!
టయోటా ల్యాండ్ క్రూయిజర్.. తొలుత 3.3లీటర్, వీ6 డీజిల్ ఇంజిన్‌తో వస్తుందని తెలుస్తోంది. 10 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఇందులో ఉంటుందని లీక్ అయిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. దీని మ్యాగ్జిమం పవర్ అవుట్‌పుట్ 305బీహెచ్పీ, టార్క్ 700ఎన్ఎంగా ఉండొచ్చు.
ఇక డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే.. టయోటా ల్యాండ్ క్రూయిజర్‌లో 4,985ఎంఎం లెన్త్, 19,980 ఎంఎం విడ్త్, 1,945ఎంఎం హైట్, 2,850ఎంఎం వీల్‌బేస్ ఉండే అవకాశం ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 230ఎంఎం అని తెలుస్తోంది.
Toyota Land Cruiser specifications : ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్.. సూపర్ వైట్, ప్రెషియస్ వైట్ పర్ల్, డార్క్ రెడ్ మికా మెటాలిక్, ఆటిట్యూడ్ బ్లాక్, డార్క్ బ్లూ మికా రంగుల్లో అందుబాటులోకి రానుంది. మూడేళ్లు లేదా 1 లక్ష కి.మీ ప్రయాణం వరకు వారెంటీ లభించే అవకాశం ఉంది.
ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, న్యూ గ్రిల్, న్యూ ఫ్రండ్ అండ్ రేర్ బంపర్స్, 20-ఇంచ్ ఆలోయ్ వీల్స్, వ్రాప్ అరౌండ్ 2 పీస్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, 3 ఇంటీరియర్ థీమ్ ఆప్షన్స్, 12.3 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, వైరల్ లెస్ ఛార్జింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, జేబీఎల్ ఆధారిత స్పీకర్ మ్యూజిక్ సిస్టెమ్ వంటివి ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఫీచర్స్‌గా ఉన్నాయి.
టయోటా ల్యాండ్ క్రూయిజర్ ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Toyota : భారత ఆటో మార్కెట్లో స్థానాన్ని సంపాదించుకునే పట్టుదలతో టయోటా తన ప్రణళికలను మార్చుకుంది. ఇందులో భాగంగానే వరుసగా.. కార్లను లాంచ్ చేస్తోంది.
సంబంధిత కథనం