Rameshwaram Cafe Explosion : ఆ 86 నిమిషాల్లో ఏం జరిగింది? రామేశ్వరం కేఫ్ పేలుడులో కీలక ఆధారాలు..
Rameshwaram cafe blast suspect : రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరాలను అధికారులు పరిశీలించారు. పలు కీలక ఆధారాలు బయటపడ్డాయి.
Rameshwaram cafe blast exploion : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనలో పలు కీలక వివరాలు బయటకి వచ్చాయి. పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టగా పలు కీలక ఆధారాలు లభించాయి. నిందితుడు బస్సు దిగి.. కేఫ్‌లోకి వెళ్లినప్పటి నుంచి.. పేలుడు జరిగిన సమయం వరకు సంబంధించిన విజువల్స్.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అవి దర్యాప్తులో చాలా కీలకంగా మారనున్నాయి.
రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు- టైమ్‌లైన్..
శుక్రవారం ఉదయం 11:30 నిమిషాలకు.. ఓ వ్యక్తి బస్సు దిగి, రామేశ్వరం కేఫ్‌లోకి వెళ్లాడు. 11:38 నిమిషాలకు రవ ఇడ్లి ఆర్డర్ చేశారు. 11:44 నిమిషాలకు రెస్ట్‌రూమ్‌కి వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. హ్యాండ్ వాష్ ఏరియాలో ఓ బ్యాగు వదిలాడు.
11:45 గంటలకు ఆ వ్యక్తి కేఫ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఫుట్‌పాత్‌పై నడవకుండా.. రోడ్డుకు అడ్డంగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
12:56 నిమిషాలకు.. బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. కస్టమర్లు, కేఫ్ సిబ్బంది.. భయంతో బయటకు పరుగులు తీశారు. అంతా గందరగోళం నెలకొంది.
Rameshwaram cafe blast news : దర్యాప్తులో భాగంగా.. కేఫ్‌లోని సీసీటీవ కెమెరాలను పరిశీలించిన పోలీసుల కన్ను ఆ వ్యక్తిపై పడింది. అతని కదలికలను గమనించారు. ఓ బ్యాగును అతను వదిలివెళ్లడాన్ని గుర్తించారు. అందులోనే ఐఈడీ ఉందని, అదే పేలిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఫుట్‌పాత్‌పై నడిస్తే.. సీసీటీవీ కెమెరాకు ముఖం కనిపిస్తుందని గ్రహించి, కావాలనే రోడ్డుపై ఆ వ్యక్తి నడిచాడని పోలీసులకు అర్థమైంది.
మరో క్లిప్‌లో.. నిందితుడు ఫోన్లో మాట్లాడటాన్ని పోలీసులు గమనించారు. ఆ సమయంలో.. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుకు ముందు.. అక్కడి వెళ్లిన కాల్స్‌ని ట్రాక్ చేయడం మొదలుపెట్టారు.
Rameshwaram cafe blast suspect : అయితే.. ఆ నిందితుడు ఎవరు? అనేది ఇంకా తెలియలేదు. సీసీటీవీ కెమెరాల్లో అతని ముఖం కూడా సరిగ్గా కనిపించడం లేదని తెలుస్తోంది. కేఫ్ లోపల ఉన్న కెమెరాలకు అతను చిక్కాడు. ఓ ప్లేట్ ఇడ్లీ పట్టికెళుతూ కనిపించాడు. కానీ ఆ వ్యక్తి.. తన ముఖాన్ని మాస్క్, గ్లాస్‌తో కప్పేశాడు. తలపై క్యాప్ పెట్టుకున్నాడు. అందుకే.. అతడిని గుర్తించడం మరింత కష్టంగా మారింది.
బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. నిందితుడిని ట్రేస్ చేసి, అతనిడి పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.
సంబంధిత కథనం