Explosion in Bengaluru: బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో భారీ పేలుడు, పలువురికి తీవ్ర గాయాలు-explosion at bengalurus rameshwaram cafe injuries reported ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Explosion At Bengaluru's Rameshwaram Cafe, Injuries Reported

Explosion in Bengaluru: బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో భారీ పేలుడు, పలువురికి తీవ్ర గాయాలు

HT Telugu Desk HT Telugu
Mar 01, 2024 02:44 PM IST

Explosion in Bengaluru: బెంగళూరులో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. బెంగళూరులోని రాజాజీ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ హోటల్ రామేశ్వరం కెఫే లో ఈ పేలుడు సంభవించింది.

బెంగళూరులోని రామేశ్వరం కెఫే
బెంగళూరులోని రామేశ్వరం కెఫే

Explosion in Bengaluru: బెంగళూరులో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. బెంగళూరులోని రాజాజీ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ హోటల్ రామేశ్వరం కెఫే లో ఈ పేలుడు సంభవించింది.

ట్రెండింగ్ వార్తలు

తీవ్ర గాయాలు..

గత కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న బెంగళూరు శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడుతో ఉలిక్కిపడింది. బెంగళూరులోని రాజాజీ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ హోటల్ రామేశ్వరం కెఫే లో ఒక్కసారిగా భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు లో ఐదుగురికి తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. పేలుడు సమచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈ పేలుడుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ పేలుడు ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక కుట్ర కోణం ఏదైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకైతే, ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద లేదా తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఘటన జరిగిన ప్రాంతం హెచ్ ఏ ఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.

ఎలా జరిగింది?

రామేశ్వరం కెఫే సమీపంలో ఒక బ్యాగ్ లో పేలుడు పదార్ధాన్ని ఉంచి, రిమోట్ తో దాన్ని పేల్చినట్లు భావిస్తున్నారు. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ బ్యాగ్ ను అక్కడ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పేలుడుతో రద్దీగా ఉండే రామేశ్వరం కెఫే లో ఒక్కసారిగా గందరగోళం, తొక్కిసలాట నెలకొన్నది. ఈ పేలుడుతో రామేశ్వరం కెఫే కూడా భారీగా ధ్వంసమైంది.

WhatsApp channel