Miracle Cow : ఈ ఆవు ఒక్క దూడకూ జన్మనివ్వలేదు.. కానీ రోజుకు 4 లీటర్ల పాలు ఇస్తుంది-this miracle cow has never given birth but gives 4 litres milk every day ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Miracle Cow : ఈ ఆవు ఒక్క దూడకూ జన్మనివ్వలేదు.. కానీ రోజుకు 4 లీటర్ల పాలు ఇస్తుంది

Miracle Cow : ఈ ఆవు ఒక్క దూడకూ జన్మనివ్వలేదు.. కానీ రోజుకు 4 లీటర్ల పాలు ఇస్తుంది

Anand Sai HT Telugu
Oct 28, 2024 06:07 PM IST

Miracle Cow : హిందూ మతంలో ఆవును గోమాత అంటారు. ఆవు గర్భంతో ఉన్నప్పుడు పాలు ఇవ్వదు. పాలు ఇవ్వాలంటే కచ్చితంగా దూడకు జన్మానివ్వాలని అందరికీ తెలుసు. కానీ ఓ ఆవు మాత్రం ఇప్పటి వరకూ ఒక్క దూడకు కూడా జన్మనివ్వలేదు. కానీ రోజుకు నాలుగు లీటర్ల పాలు ఇస్తోంది.

రోజుకు 4 లీటర్ల పాలు ఇస్తున్న ఆవు
రోజుకు 4 లీటర్ల పాలు ఇస్తున్న ఆవు

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో ఓ అద్భుతమైన ఆవు ఉంది. ఈ ఆవు ఇప్పటివరకు గర్భం దాల్చలేదు. ఒక్క దూడకు కూడా జన్మనివ్వలేదు. అయితే రోజూ 4 లీటర్ల పాలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొదట్లో కేవలం 250 మి.లీ పాలను మాత్రమే ఇచ్చేంది. కానీ రోజువారీ పాలు పితకడం మెుదలుపెట్టిన తర్వాత రోజుకు 4 లీటర్ల పాలను ఇస్తుంది. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు.

ఈ ఆవు పశువైద్యులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో దూడకు జన్మనివ్వకపోయినా ప్రతిరోజూ పాలు ఇస్తున్న ఆవు గురించి వైరల్‌గా మారింది. ఈ ఆవును కామధేనువుగా చెబుతున్నారు. చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు. పాయగ్‌పూర్ తహసీల్‌లోని గంగా తివారిపూర్ గ్రామంలో ఉన్న ఈ ఆవు రిటైర్డ్ ప్రొఫెసర్ డా. ఓంకార్‌నాథ్ త్రిపాఠికి చెందినది.

తన దగ్గర అనేక ఆవుల ఉన్నాయి. ఆవులను పెంచడం అంటే ఇష్టంతొ కొన్నింటిని తెచ్చుకున్నాడు. ఈ ఆవు 6 నెలల క్రితం పాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. మొదట్లో 250 మి.లీ ఇచ్చేది. కానీ సాధారణంగా రోజూ పాలు పితకడం అలవాటు చేసిన తర్వాత రోజుకు 4 లీటర్లకు పెరిగింది.

డా. త్రిపాఠి ఈ ఆవును బాగా చూసుకుంటాడు. ఇతర ఆవుల మాదిరిగానే దానికి మేత, నీరు ఇస్తాడు. తన దగ్గర ఉన్న ఇతర దూడను పోషించడానికి ఈ ఆవు పాలను ఉపయోగిస్తాడు. దాని తల్లి ప్రసవించిన కొద్దిసేపటికే చనిపోయింది. దీంతో ఈ ఆవు పాలనే తాగుతూ పెరుగుతోంది. పాలు బాగానే ఉన్నాయని చెబుతున్నారు. అయితే దాని కొవ్వు పదార్థం ఇతర ఆవుల సగటు పాల కంటే ఎక్కువగా ఉంది. దీంతో స్థానిక పశువైద్యుల్లో ఆసక్తి నెలకొంది.

గర్భం దాల్చని ఆవుల్లో పాలు ఉత్పత్తి కావడానికి హార్మోన్ల అసమతుల్యత కారణమని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆవును చూసేందుకు చాలా మంది స్థానికులు వస్తుంటారు. ఇది ప్రస్తుతానికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Whats_app_banner