Theft in Yuvraj Singh house : టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంట్లో దొంగతనం జరిగింది. హరియాణా పంచ్‌కులలోని అతని నివాసంలో రూ. 75వేల క్యాష్, ఎంతో విలువ చేసే నగలు దొంగతనానికి గురయ్యాయి. ఇంట్లో పనిచేసే సిబ్బందే.. ఈ దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తోంది!
ఈ ఘటన 2023 అక్టోబర్ నాటిది! యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్.. 2023 సెప్టెంబర్‌లో గుర్గావ్లోని మరో ఇంటికి వెళ్లారు. అక్టోబర్ 5న.. పంచ్‌కులలోని ఎండీసీ సెక్టార్ 4లో ఉన్న నివాసానికి తిరిగి వచ్చారు. యువరాజ్ ఇంట్లో దొంగతనం జరిగిందని, రూ. 75వేల నగదు, ఎంతో విలువ చేసే జ్యువెల్లరీ కనిపించడం లేదని ఆమె గుర్తించారు. ఈ నేపథ్యంలోనే.. హౌజ్ కీపింగ్ స్టాఫ్ లలితా దేవి, సిల్దార్ పాల్‌పై ఆమెకు అనుమానం మొదలైంది. ఆమె సొంతంగా అసలు విషయం తెలుసుకోవాలని భావించి, అనుమానితుల కదలికలను గమనించారు. కానీ ఎలాంటి క్లూ లభించలేదు.
ఇంతలో దీపావళి వచ్చింది. లలిదా దేవి, సిల్దార్ పాల్లు.. దీపావళి సమయంలో హఠాత్తుగా ఉద్యోగాలు వదిలేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారిద్దరే యువరాజ్ ఇంట్లో దొంగతనం చేసి ఉంటారన్న యువరాజ్‌సింగ్ తల్లి అనుమానాలు మరింత బలపడ్డాయి. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Yuvraj Singh latest news : నిందితులను పట్టుకునేందుకే ఈ విషయాన్ని ఇంతకాలం గుట్టుగా ఉంచినట్టు పోలీసులు వెల్లడించారు.
"అన్ని వివరాలు మీడియాకు చెప్పేస్తే.. దొంగలను మేము ఎలా పట్టుకోవాలి?" అని ఎస్హెచ్ఓ మాన్స దేవి అన్నారు.
మరి యువరాజ్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వారిని పోలీసులు ఇంకా పట్టుకున్నారా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు. 6 నెలల క్రితం జరిగిన ఈ ఘటన మాత్రం తాజాగా వెలుగులోకి వచ్చింది.
Ganguly phone stolen : కాగా.. మరో మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఇంట్లో కూడా ఇటీవలే దొంగతనం జరిగింది. వ్యక్తిగత సమాచారం ఉన్న ఓ ఫోన్ దొంగతనానికి గురైనట్టు.. ఫిబ్రవరి 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు గంగూలీ.
దొంగతనం జరిగినప్పుడు.. గంగూలీ ఇంట్లో లేరు. ఇంట్లోనే దానిని వదిలి బయటకు వెళ్లినట్టు, తిరిగి వచ్చి చూసేసరికి లేదని ఆయన పోలీసులకు తెలిపారు. కాగా.. గంగూలీ ఇంట్లో ఆ సమయంలో పెయింటింగ్ వర్క్ జరిగింది. పెయింటింగ్ వేసేందుకు వచ్చిన వారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం