Lift Review: 40 వేల అడుగుల ఎత్తు.. 4 వేల కోట్ల గోల్డ్ దొంగతనం.. లిఫ్ట్ మూవీ రివ్యూ-lift movie review in telugu and rating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lift Review: 40 వేల అడుగుల ఎత్తు.. 4 వేల కోట్ల గోల్డ్ దొంగతనం.. లిఫ్ట్ మూవీ రివ్యూ

Lift Review: 40 వేల అడుగుల ఎత్తు.. 4 వేల కోట్ల గోల్డ్ దొంగతనం.. లిఫ్ట్ మూవీ రివ్యూ

Sanjiv Kumar HT Telugu
Jan 20, 2024 05:30 AM IST

Lift Movie Review In Telugu: దొంగతనం నేపథ్యంలో వచ్చిన లేటెస్ట్ ఓటీటీ మూవీ లిఫ్ట్. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా 4 వేల కోట్ల విలువగల బంగారాన్ని చోరీ చేసే కథతో తెరకెక్కింది. మరి సినిమా ఎలా ఉందో లిఫ్ట్ రివ్యూలో తెలుసుకుందాం.

విమానంలో 4 వేల కోట్ల బంగారం దొంగతనం.. లిఫ్ట్ మూవీ రివ్యూ
విమానంలో 4 వేల కోట్ల బంగారం దొంగతనం.. లిఫ్ట్ మూవీ రివ్యూ

టైటిల్: లిఫ్ట్

నటీనటులు: కెవిన్ హార్ట్, గుగు, సామ్ వర్థింగ్టన్, ఉర్సులా కార్బెరో, బిల్లీ మాగ్నిస్సేన్, కిమ్ యున్ జి, జీన్ రెనో, విన్సెంట్ తదితరులు

కథ: డేనియల్ కుంక

దర్శకత్వం: ఎఫ్ గ్యారీ గ్రే

నిర్మాత: అడ్రీ చోన్

సంగీతం: డామినిక్ లెవిస్, గిలియమ్ రస్సెల్

సినిమాటోగ్రఫీ: బెర్న్‌హార్డ్ జాస్పర్

ఎడిటింగ్: విలియమ్ యే

రిలీజ్ డేట్: జనవరి 12, 2024

ఓటీటీ వేదిక: నెట్‌ఫ్లిక్స్

Lift Review Telugu 2024: దొంగతనం నేపథ్యంలో వచ్చే సినిమాలు, సిరీసులపై చాలావరకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. అలా ఓటీటీలో వచ్చిన మనీ హేస్ట్, బెర్లిన్ వెబ్ సిరీసులు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో చోరీ నేపథ్యంలో సాగే కథతో వచ్చిన మూవీ లిఫ్ట్. హాలీవుడ్ పాపులర్ కమెడియన్, నిర్మాత అయిన కెవిన్ హార్ట్ మెయిన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో అవతార్ హీరో సామ్ వర్థింగ్టన్, మనీ హేస్ట్ నటి ఉర్సులా కార్బెరో, పాపులర్ యాక్టర్ జీన్ రెనో వంటి స్టార్ క్యాస్ట్ నటించింది. ఇలాంటి లిఫ్ట్ మూవీ రివ్యూలోకి వెళితే..

కథ:

సైరస్ (కెవిన్ హార్ట్) ఒక ఇంటర్నేషనల్ దొంగ. అతనికి ఐదుగురు సభ్యులతో టీమ్ ఉంటుంది. ఎలాంటి దొంగతనం అయినా పర్ఫెక్ట్ ప్లాన్‌తో టీమ్ అంతా ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ అవుతారు. సైరస్‌ను ఎలాగైన పట్టుకోవాలని ఇంటర్‌పోల్ ఆఫీసర్ ఏజెంట్ గ్లాడ్‌వెల్ అలియాస్ ఆబీ (గుగు) ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇంటర్‌పోల్ కోసం హై టెక్నాలజీ ఉన్న విమానంలో 500 మిలియన్ డాలర్ల (సుమారు 4 వేల కోట్లు) విలువ గల బంగారాన్ని దొంగతనం చేయడానికి ఒప్పుకునేలా చేయాలని ఏజెంట్ గ్లాడ్‌వెల్‌కు ఇంటర్‌పోల్ చీఫ్ ఆఫీసర్ హక్స్‌లీ (సామ్ వర్థింగ్టన్) ఆదేశిస్తాడు.

ఇంట్రెస్టింగ్ పాయింట్స్

తాను పట్టుకోవాలనుకున్న సైరస్‌తోనే దొంగతనం చేసేలా డీల్ కుదుర్చుకుంటుంది ఏజెంట్ గ్లాడ్‌వెల్. దొంగతనం ఒప్పుకున్న సైరస్ ఎలాంటి కండిషన్స్ పెట్టాడు? ఎందుకు పెట్టాడు? వాళ్లు దొంగతనం చేయాలనుకున్న గోల్డ్ ఎవరిది? దాన్ని అలా విమానంలో ఎవరికి ఎందుకు ట్సాన్స్‌ఫర్ చేయాలనుకున్నారు? జోగర్‌సన్ (జీన్ రెనో) అనే క్రిమినల్ బ్యాంకర్ ఎలాంటి వాడు? 40 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానంలో సైరస్ టీమ్ ఎలా దొంగతనం చేసింది..? 500 మిలియన్ డాలర్ల గోల్డ్‌ను కొట్టేసి ఇంటర్‌పోల్‌కు ఎలా అప్పగించారు? సైరస్‌కు ఏజెంట్ గ్లాడ్‌వెల్‌కు ఉన్న రిలేషన్ ఏంటీ? వంటి తదితర ఆసక్తికర విషయాల కథనమే లిఫ్ట్.

విశ్లేషణ:

ముందుగా చెప్పుకున్నట్లు దొంగతనం కాన్సెప్టుతో వచ్చే సినిమాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. వాటిని పర్ఫెక్ట్‌ స్క్రీన్‌ప్లే, ఎంగేజింగ్ సీన్లతో, స్పీడీ నెరేషన్‌తో తెరకెక్కిస్తే అదిరిపోతాయి. లిఫ్ట్ మూవీ ట్రైలర్ చూస్తే క్యూరియాసిటీ పెంచేలా ఉంటుంది. కానీ, అది చూసి లిఫ్ట్ మూవీ చూసేవారికి కాస్తా నిరాశే మిగలవచ్చు. ఎందుకంటే ట్రైలర్‌లో చూపించినంత థ్రిల్లింగ్‌గా లిఫ్ట్ మూవీ ఉండదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి.

ఆసక్తిగా దొంగతనం

లిఫ్ట్ స్టార్టింగ్ సీన్ బాగుంటుంది. ఎన్‌ఎఫ్‌టీని దొంగతనం చేసే తీరు ఆకట్టుకోవడమే కాకుండా ఇంటర్‌పోల్ ఆఫీసర్స్ 4 వేల కోట్ల విలువైన దొంగతనం చేయమని చెప్పడంతో కథలో ఆసక్తి మొదలవుతుంది. గోల్డ్ దొంగతనం చేసేందుకు వేసే ప్లాన్స్, అందుకు కావాల్సిన నీడ్స్, మనుషులతో మాట్లాడటం వంటి సీన్లతో బాగానే అనిపిస్తుంది. మధ్యలో సైరస్, ఏజెంట్ గ్లాడ్‌వెల్ లవ్ స్టోరీ గురించి మాట్లాడటం వారి మధ్యలో ఉన్న బంధాన్ని ఎలివేట్ చేసేందుకు ట్రై చేశారు.

ట్విస్టులు ఓకే

అయితే, విమానంలో దొంగతనం చేయడం అంతగా హై ఇవ్వొదు. చాలా నార్మల్‌గా ఉంటుంది. విమానంలో జరిగే యాక్షన్ సీన్ పర్వాలేదు. ఒకట్రెండు ట్విస్టులు ఆకట్టుకుంటాయి. సైరస్ టీమ్‌కు జోగర్‌సన్ తన మనుషులతో వేసే స్కెచ్ బాగానే ఉంటుంది. అందుకు సైరస్ కౌంటర్ ఎటాక్ ఓకే. జోగర్‌సన్ అంత గోల్డ్ లివియాతాన్‌కు ఎందుకు ఇస్తున్నాడో క్లారిటీగా చెప్పలేదు. అయితే, లివియాతాన్ గ్యాంగ్ జోగర్‌సన్‌ను గోల్డ్ రూపంలోనే ఎందుకు అడిగారో చెప్పిన రీజన్ బాగుంది.

అతి తక్కువ రన్ టైమ్

క్లైమాక్స్ ట్విస్ట్ పర్వాలేదు. చాలావరకు ఊహించవచ్చు. లిఫ్ట్ మూవీ సాంకేతికపరంగా చాలా బాగుంది. ఉన్న ఒకటిరెండు యాక్షన్ సీన్స్ పర్వాలేదు. 40 వేల అడుగుల ఎత్తులో 4 వేల కోట్ల విలువైన గోల్డ్ దొంగతనం అనే కాన్సెప్టు ఆసక్తిగా అనిపించిన తెరకెక్కించే విధానంలో ఆకట్టుకోలేకోపోయింది. లిఫ్ట్ రన్ టైమ్ (గంట 46 నిమిషాలు) కూడా చాలా తక్కువ. ఈ రన్ టైమ్‌తో వచ్చిన చాలా వరకు సినిమాలు ఆకట్టుకున్నాయి.

స్టార్ క్యాస్ట్‌తో లేని ఉపయోగం

సినిమాలో చాలా స్టార్ క్యాస్ట్ ఉంది. కానీ, వారిని సరిగా ఉపయోగించుకోలేదు. యాక్టింగ్ పర్వాలేదు అంతే. క్లైమాక్స్‌లో విలన్‌గా జీన్ రెనోని కాస్తా పవర్‌ఫుల్‌గా చూపించారు. ఇక అవతార్ హీరో సామ్ వర్థింగ్టన్‌కు అది పెద్ద పాత్ర కూడా కాదు. ఏదో సైడ్ క్యారెక్టర్‌లా ఉంటుంది. అతను అవతార్ హీరో అని తెలిసినవారికి మాత్రం పెద్ద డిసాప్పాయిమెంట్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాను మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్, ది ఇటాలియన్ జాబ్, ది ఫేట్‌ ఆఫ్ ది ఫ్యూరియస్ వంటి సక్సెస్‌ఫుల్ మూవీస్‌ను డైరెక్ట్ చేసిన ఎఫ్ గ్యారీ గ్రే తెరకెక్కించడం విశేషం.

ఫైనల్‌గా చెప్పాలంటే!

Lift Movie Review: ఇక ఫైనల్‌గా చెప్పాలంటే కాన్సెప్ట్ బాగున్నా టేకింగ్‌ను సరిగా లిఫ్ట్ చేయలేకపోయారనే ఫీలింగ్ కలుగుతుంది. వీకెండ్‌లో టైమ్ పాస్‌కు చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఎందుకంటే లిఫ్ట్ రన్ టైమ్ కేవలం గంట 46 నిమిషాలు మాత్రమే. వాటిలో టైటిల్ క్రెడిట్స్ తీసేస్తే.. గంటన్నర మాత్రమే ఉంటుంది.

WhatsApp channel