Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!-sweat infused rice balls shaped using armpits becomes culinary hit in japan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Japan Rice Balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

Sharath Chitturi HT Telugu
May 04, 2024 12:10 PM IST

Sweat infused rice balls : జపాన్​ నుంచి వస్తున్న ఓ వార్త.. ఇప్పుడు వైరల్​గా మారింది. అక్కడి ట్రెడీషనల్​ డిష్​ని.. కొన్ని రెస్టారెంట్లు, చంకలో పెట్టి, చెమటతో తయారు చేయడం మొదలుపెట్టాయి.! అవి.. భారీ ధరకు అమ్ముడుపోతున్నాయి…

జపాన్​ ట్రెడీషనల్​ డిష్​ని చంకలో పెట్టి, చెమటతో తయారు చేస్తున్నారు!
జపాన్​ ట్రెడీషనల్​ డిష్​ని చంకలో పెట్టి, చెమటతో తయారు చేస్తున్నారు! (Unsplash/Max Griss)

Sweat-infused rice balls in Japan : ప్రపంచంలో జరుగుతున్న వింత-విచిత్ర సంఘటనలు నిత్యం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతూనే ఉంటున్నాయి. 'ఇలాంటిది కూడా ఉంటుందా? మనుషులు ఇలా కూడా ఉంటారా?' అని.. వాటిని చూస్తే డౌట్​ వస్తుంది. ఇక ఇప్పుడు.. జపాన్​కు చెందిన ఓ వార్తను విన్న వారందరు.. షాక్​ అవుతున్నారు. అక్కడి ప్రముఖ, ట్రెడీషనల్​ డిష్.. 'ఒనిగిరి' అనే రైస్​ బాల్​​ని కొత్త విధానంలో తయారు చేయడం ఇందుకు కారణం! కొత్తగా తయారు చేస్తే ఏముంది? అని అనుకుంటున్నారా? ఆ ఒనిగిరిని.. చంకలో పెట్టి, చెమటతో తయారు చేస్తుండటం ఇక్కడ అసలు విషయం. అంతేకాదు.. ఎంత ధర పెట్టినా, అక్కడి ప్రజలు వీటిని ఎగబడి మరీ కొంటున్నారట!

చంకలో పెట్టి.. చెమటతో..!

ఒనిగిరి అనే రైస్​ బాల్​ డిష్​.. జపాన్​లో చాలా ఫేమస్​. శతాబ్దాలుగా ఈ డిష్​ని జపనీయులు వండుకుంటున్నారు. ఇవి.. ట్రైయాంగిల్​ షేప్​లో ఉంటాయి.

సౌత్​ చైనా మార్నింగ్​ పోస్ట్​ అనే మీడియా సంస్థ ప్రకారం.. ఒనిగిరిని తయారు చేసే మహిళలు.. డిష్​కి ట్రైయాంగిల్​ షేప్​ని తీసుకురావడం కోసం.. వాటిని తమ చంకల్లో పెట్టుకుని ఒత్తుతున్నారు!

Japan rice balls : అయితే.. ఈ మహిళలు పూర్తి హైజీన్​ ప్రొటోకాల్​ని పాటిస్తారట. ఫుడ్​కి కాంటాక్ట్​లో వచ్చే శరీర భాగాలను డిసిన్ఫెక్ట్​ చేసుకుంటారట. ఆ తర్వాత చెమట వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత.. చేతులు వాడకుండా.. చంకలో పెట్టుకుని డిష్​ని తయారు చేస్తారు!

ఒనిగిరి రైస్​ బాల్స్​ని తయారు చేసేందుకు.. జపాన్​లోని చాలా రెస్ట్రారెంట్స్​లో ఇదే ప్రాసెస్​ నడుస్తోంది. అంతేకాదు.. చాలా రెస్టారెంట్లు.. ఈ ప్రాసెస్​ని బహిరంగంగా కూడా ప్రదర్శిస్తున్నాయి. 'ఇదేదో యునీక్​ టెక్నిక్​లా ఉందే..' అనుకుంటూ ప్రజలు ఆ ప్రాసెస్​ని ఎగబడి చూస్తున్నారు.

సాధారణ ఒనిగిరి ధర కన్నా.. ఇలా చంకలో పెట్టి, చెమటతో తయారు చేస్తున్న డిష్​.. 10 రెట్లు అధిక ధర పలుకుతుండటం గమనార్హం.

మరి టేస్ట్​ ఎలా ఉంది? అని ఓ కస్టమర్​ని అడగ్గా.. "పెద్దగా తేడా లేదు. ఫ్లేవర్​ కూడా మారలేదు. సాధారణ ఒనిగిరి టేస్టే ఇందులోనూ ఉంది," అని బదులిచ్చారు.

Japan Onigiri rice balls : ఇలా చంకలో పెట్టి, చెమటతో రైస్​ బాల్స్​ని తయారు చేయడం, వాటిని జపాన్​వాసులు ఎగబడి తింటుండటం.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఈ వార్త విన్న వారందరు షాక్​కు గురవుతున్నారు. ఇంకొందరు మద్దతిస్తున్నారు.

"హైజీన్​గా ఉన్నంత కాలం.. ఈ ప్రాసెస్​తో ఎలాంటి హాని లేదు," అని ఒకరు రాసుకొచ్చారు.

Japan rice balls made with sweat : "ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు! దీనిని తయారు చేసే వారికి అనారోగ్య సమస్యలు ఉంటే? నేను ఈ తరహా రైస్​ బాల్​ని ప్రిఫర్​ చేయను," అని మరొకరు పేర్కొన్నారు.

"ఇదేం పిచ్చి! ఇదేం పైత్యం" అని మరో నెటిజన్​ స్పందించారు.

మరి.. ఈ 'యునీక్​ టెక్నిక్'​తో తయారవుతున్న ఒనిగిరి రైస్​ బాల్స్​పై మీ ఒపీనియన్​ ఏంటి?

IPL_Entry_Point

సంబంధిత కథనం