జపాన్లోని విద్యుత్ రంగానికి చెందిన నియో కార్పొరేషన్ సంస్థపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పని ప్రదేశంలో ఉద్యోగులను నగ్న ఫోటోలు తీసి ఫార్వర్డ్ చేయాలని కంపెనీ బలవంతం చేసిందని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఇంకా అనేక అమానవీయ ఆరోపణలను ఇప్పుడు ఈ కంపెనీ ఎదుర్కొంటోంది.