ఒకేసారి రూ. 20 తగ్గిన పెట్రోల్- డీజిల్ ధరలు.. ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్!
Sri Lanka crisis : సంక్షోభంతో అల్లాడిపోతున్న ప్రజలకు శ్రీలంక ప్రభుత్వం కాస్త న్యూస్ ఇచ్చింది. పెట్రోల్- డీజిల్ ధరలను రూ. 20 తగ్గించింది.
Sri Lanka crisis : శ్రీలంక సంక్షోభం వేళ ప్రజలకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది ప్రభుత్వం. పెట్రోల్- డీజిల్ ధరలను రూ. 20 మేర తగ్గించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆధారిత సీపీసీ(సిలోన్ పెట్రోలియం కార్పరేషన్), ఎల్ఐఓసీ(లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) సంస్థలు ఈ విషయాన్ని సోమవారం ప్రకటించాయి.
శ్రీలంక సంక్షోభంపై మీడియా కథనాల ప్రకారం.. లీటరు పెట్రోల్(ఆక్టేన్ 92) ధర 450 శ్రీలంక రూపీ. అక్టోన్ 95 లీటరు పెట్రోల్ ధర 540 శ్రీలంక రూపీ. ఆక్టేన్ 92 పెట్రోల్ మీద రూ. 20 తగ్గింది. అదే సమయంలో ఆక్టేన్ 95 పెట్రోల్ మీద రూ. 10 దిగొచ్చింది.
శ్రీలంక సంక్షోభం వేళ డీజిల్ ధర కూడా రూ. 20 తగ్గింది. ప్రస్తుతం లీటరు డీజిల్ ధర 440 శ్రీలంక రూపీ. లీటరు సూపర్ డీజిల్ ధర.. రూ. 10 తగ్గి ప్రస్తుతం 510 శ్రీలంక రుపాయలుగా ఉంది.
తీవ్ర కొరత..
Sri Lanka crisis petrol price : శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో ఇతర దేశాల నుంచి పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేయలేని పరిస్థితి. ఇంధన కొరతతో ప్రజలు రోజుల తరబడి పెట్రోల్ బంకుల్లో పడిగాపులు గాస్తున్నారు. ఆ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారాయి.
శ్రీలంకను ఆదుకునేందుకు ఇండియా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికే రెండు, మూడు షిప్‌లలో చమురును పంపించింది.
శ్రీలంకలో పెట్రోల్ కొరత ఒక ఎత్తైతే.. రాజకీయ సంక్షోభం అంతకు మించి ఉంది. నిరసనకారుల ఆగ్రహంతో.. గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేసి.. దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. మరికొన్ని రోజుల్లో శ్రీలంకకు నూతన అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
శ్రీలంక సంక్షోభం నుంచి ఎప్పుడు గట్టెక్కుతామా అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
సంబంధిత కథనం