Sri Lanka Crisis : శ్రీలంక అధ్యక్షుడి రేసులో ఆ ముగ్గురు- 7 రోజుల్లో..-sri lankan president resigns parliament to convene ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sri Lanka Crisis : శ్రీలంక అధ్యక్షుడి రేసులో ఆ ముగ్గురు- 7 రోజుల్లో..

Sri Lanka Crisis : శ్రీలంక అధ్యక్షుడి రేసులో ఆ ముగ్గురు- 7 రోజుల్లో..

Sharath Chitturi HT Telugu
Jul 15, 2022 10:06 AM IST

Sri Lanka Crisis : శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ 7రోజుల్లో పూర్తికానుంది. కాగా.. ఇప్పటికే అధ్యక్షుడి రేసులో ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి.

<p>శ్రీలంక అధ్యక్షుడి రేసులో ఆ ముగ్గురు- 7 రోజుల్లో..</p>
శ్రీలంక అధ్యక్షుడి రేసులో ఆ ముగ్గురు- 7 రోజుల్లో.. (REUTERS)

Sri Lanka Crisis : శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో.. ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. గొటబాయ రాజపక్స గురువారం రాజీనామా చేసినట్టు.. శుక్రవారం ఉదయం పార్లమెంట్​ స్పీకర్​ మహింద అబేవర్దన వెల్లడించారు. శనివారం పార్లమెంట్​ సమావేశమవుతుందని, నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.

శ్రీలంక సంక్షోభానికి గొటబాయ రాజపక్స అసలు కారణమని దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. అనంతరం పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్పీకర్​కు ఈమెయిల్​ పంపించారు. ఫలితంగా శ్రీలంకవ్యాప్తంగా ఆందోళనకారులు సంబరాలు చేసుకున్నారు. ఈ సమయంలోనే గత వారం స్వాధీనం చేసుకున్న అధ్యక్షుడి నివాసాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. కానీ ఇప్పటికీ అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణమే ఉంది.

రేసులో ఆ ముగ్గురు..

శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో గొటబాయ రాజపక్స రాజీనామా చేయడంతో శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న విషయంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా.. రేసులో ప్రస్తుతం ముగ్గురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.

  • రణిల్​ విక్రమసింఘే:- ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్న రణిల్​ విక్రమసింఘే.. అధ్యక్షుడి రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీలంక అధికార పక్షం ఎస్​ఎల్​పీపీతో పాటు గొటబాయ రాజపక్స సోదరుడు బాసిల్​ రాజపక్స మద్దతు కూడా విక్రమసింఘేకే ఉందని సమాచారం. ప్రస్తుతం ఆర్థికమంత్రిగానూ కొనసాగుతున్న విక్రమసింఘే.. అధ్యక్షుడి బాధ్యతను సమర్థవంతంగా కొనసాగించగలరని అధికారపక్షం భావిస్తోంది. ఒకవేళ ఇదే నిజమై.. అధ్యక్షుడిగా గెలిస్తే.. ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిక్క ఉంది. శ్రీలంక సంక్షోభం వేళ గొటబాయ రాజపక్సపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు.. విక్రమసింఘేపైనా తమ అసహనాన్ని వెళ్లగక్కారు. ఈ పరిస్థితులు తట్టుకోలేక.. రాజీనామా చేసేందుకు సిద్ధమని విక్రమసింఘే గత వారంలో స్వయంగా ప్రకటించారు. ఒకవేళ ఆయన అధ్యక్షుడిగా గెలిచినా.. ప్రజలు మళ్లీ నిరసనలు చేయకుండా ఉంటారా? అన్నది కూడా ప్రశ్నార్థకం.
  • Sri Lanka new President:- సాజిద్​ ప్రేమదాస:- 55ఏళ్ల సాజిద్​ ప్రేమదాస.. శ్రీలంక పార్లమెంట్​లో ప్రస్తుతం విపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి రణసింఘే ప్రేమదాస.. శ్రీలంక అధ్యక్షుడిగా పని చేశారు. 1993లో ఆయన హత్యకు గురైన అనంతరం సాజిద్​ ప్రేమదాస రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అనంతరం డిప్యూటీ హెల్త్​ మినిస్టర్​గా విధులు నిర్వహించారు. శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో అధికారపక్షంపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు ప్రేమదాస. ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించారు. కానీ అధ్యక్షుడిగా ఆయన సొంతంగా గెలవలేరు! అందుకు కావాల్సిన బలం పార్లమెంట్​లో ఆయనకు లేదు. ఇతరుల మద్దతు ఆయనకు అవసరం.
  • డల్లాస్​ అలహప్పెరుమ:- డల్లాస్​ అలహప్పెరుమ.. ఓ మాజీ జర్నలిస్ట్​. ఎస్​ఎల్​పీపీలో సీనియ నేత కూడా. ఆయనకు ఓ వర్గం నుంచి భారీ మద్దతు కూడా ఉంది. అందుకే ఆయన కూడా రేసులో ఉన్నారు. అవసరమైతే ఆయన్ని గెలిపించే బలం.. అధికారపక్షానికి పార్లమెంట్​లో ఉంది. 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించారు డల్లాస్​ అలహప్పెరుమ. ఆయన వంటి మనిషి చాలా అరుదు అని పలువురు భావిస్తూ ఉంటారు.

ఏది ఏమైనా.. ఎవరు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినా.. వారికి రానున్న రోజుల్లో గడ్డుపరీక్ష ఎదురుకావడం ఖాయం. దాదాపు 6నెలలుగా శ్రీలంక సంక్షోభంతో నరకం అనుభవిస్తున్న ప్రజలను రక్షించడం అంత సులభం కాదు. ఇప్పట్లో జరిగే పని కూడా కాదు! అందువల్ల కఠిన పోరాటానికి నూతన అధ్యక్షుడు సిద్ధంగా ఉంటేనే.. ఆ పదవి చేపట్టాల్సి ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్