Sri Lanka crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటన-sri lanka declares state of emergency after president flees ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sri Lanka Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటన

Sri Lanka crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటన

HT Telugu Desk HT Telugu
Jul 13, 2022 11:53 AM IST

Sri Lanka crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.

అధ్యక్ష సచివాలయం ముందు బుధవారం నిరసనకారుల ప్రదర్శన
అధ్యక్ష సచివాలయం ముందు బుధవారం నిరసనకారుల ప్రదర్శన (AFP)

శ్రీలంక అధ్యక్షుడు దేశం విడిచివెళ్లిపోయిన కొద్ది గంటలకు ప్రభుత్వం దేశవ్యాప్తంగాht అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దీనిని ప్రధాన మంత్రి కార్యాలయం ధ్రువీకరించింది.

‘అధ్యక్షుడు దేశం విడిచిపెట్టి బయటకు వెళ్లిపోయాక దేశంలోని పరిస్తితులను అదుపులోకి తెచ్చేందుకు ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడమైంది..’ అని ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిక ప్రతినిధి డైనౌక్ కొలంబాగే చెప్పారు.

కాగా అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయాక ప్రధాన మంత్రి రణిల్ విక్రమ సింఘే కూడా రాజీనామా చేయాలంటూ ఆందోళన కారులు ప్రధాన మంత్రి కార్యాలయం వైపు చొచ్చుకువచ్చారు.

అధ్యక్షుడు రాజపక్సే ఈ ఉదయం శ్రీలంక ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానంలో మాల్దీవులకు వెళ్లి తలదాచుకున్నారు. ఆయన వెంట భార్య, ఇద్దరు అంగరక్షకులు కూడా వెళ్లారు. ఆయన బయటికి వెళ్లిపోయేందుకు రక్షణ శాఖ అనుమతి లభించింది. నిన్న రాజపక్సే ఇచ్చిన రాజీనామా నేడు పార్లమెంటు స్పీకర్‌కు చేరనుంది.

విక్ర‌మ‌సింఘేకు ప‌గ్గాలు

నూత‌న అధ్య‌క్షుడి ఎన్నిక ఈ నెల 20న జ‌ర‌గాల్సి ఉండగా ఈ లోపే ప్ర‌ధాని విక్ర‌మ సింఘెను తాత్కాలిక అధ్య‌క్షుడిగా స్పీక‌ర్ మ‌హింద యాప అభ‌య‌వ‌ర్ధ‌నే నియ‌మించారు. ఆందోళ‌న‌కారుల‌పై భ‌ద్ర‌తాద‌ళాలు టియ‌ర్ గ్యాస్‌, వాట‌ర్ కెనాన్‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

ఆందోళ‌న‌కారుల్లో ఆగ్ర‌హం

ప్ర‌ధాని ప‌ద‌వికి విక్ర‌మ సింఘె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. తాజాగా, ఆయ‌న అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఆందోళ‌న‌కారుల్లో తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. ఆయ‌న అధికారిక నివాసాన్ని ఆందోళ‌న‌కారులు చుట్టుముట్టారు. ఇంట్లోకి చొచ్చుకువెళ్లేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. వారిని భ‌ద్ర‌త‌ద‌ళాలు అతిక‌ష్టం మీద అడ్డుకుంటున్నాయి. గాలిలో కాల్పులు జ‌రిపి, వారిని చెద‌ర‌గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్