Porn passport : ప్రభుత్వం కొత్త యాప్​- మైనర్లు పోర్న్​ చూస్తే దొరికిపోతారు..-spain to introduce porn passport what is it and how does it work ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Porn Passport : ప్రభుత్వం కొత్త యాప్​- మైనర్లు పోర్న్​ చూస్తే దొరికిపోతారు..

Porn passport : ప్రభుత్వం కొత్త యాప్​- మైనర్లు పోర్న్​ చూస్తే దొరికిపోతారు..

Sharath Chitturi HT Telugu
Jul 06, 2024 01:40 PM IST

Porn Passport : పోర్న్​ పాస్​పోర్ట్​ పేరుతో ఓ యాప్​ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో ఇచ్చే టోకెన్స్​తో ఎన్ని పోర్న్​ వీడియోలైనా చూడొచ్చు. కానీ ఈ యాప్​ అసలు ఉద్దేశం ఏంటంటే..

పోర్న్​ పాస్​పోర్ట్​ని లాంచ్​ చేస్తున్న ప్రభుత్వం..
పోర్న్​ పాస్​పోర్ట్​ని లాంచ్​ చేస్తున్న ప్రభుత్వం..

పోర్నోగ్రఫీ సమస్య ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది. మరీ ముఖ్యంగా చిన్నారులు, మైనర్లకు పోర్న్​ వీడియోలు సులభంగా యాక్సెస్​ అవుతుండటంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు స్పెయిన్​ ప్రభుత్వం త్వరలో ఒక మొబైల్​ అప్లికేషన్​ని లాంచ్​ చేసేందుకు రెడీ అవుతోంది. దీని పేరు 'పోర్న్​ పాస్​పోర్ట్​'! నిర్దిష్ట వయస్సు గల లీగల్​ యూజర్లకు మాత్రమే పోర్న్​ కంటెంట్​ అందుబాటులో ఉంచడం ఈ యాప్​ లక్ష్యం. చిన్నారులు ఈ కంటెంట్​ చూడకుండా ఈ యాప్​ జాగ్రత్త పడుతుంది.

పోర్న్​ పాస్​పోర్ట్​ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది?

స్పెయిన్​ ప్రభుత్వానికి చెందిన సరికొత్త డిజిటల్​ వాలెట్​ యాప్​లో భాగం ఈ పోర్న్​ పాస్​పోర్ట్​. దీని అధికారిక పేరు డిజిటల్​ వాలెట్​ బీటా (కార్టెరా డిజిటల్​ బీటా). పోర్న్​ చూస్తున్న వ్యక్తికి నిర్దిష్ట వయస్సు పరిమితి ఉందా? లేదా? అనేది చెక్​ చేసేందుకు ఇంటర్నెట్​ ప్లాట్​ఫామ్స్​కి ఈ యాప్​ అనుమతులు ఇస్తుంది.

త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ యాప్​లో వినియోగదారులు తమ వయస్సును వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్​ పూర్తైన తర్వాత, వారికి 30 పోర్న్​ క్రెడిట్స్​ వస్తాయి! వాటి ద్వారా పోర్న్​ కంటెంట్​కి యాక్సెస్​ లభిస్తుంది. నెల రోజుల పాటు ఈ పోర్న్​ క్రెడిట్స్​ వాలిడ్​గా ఉంటాయి.

ఒక్కో క్రెడిట్​కి ఒక్కో క్యూఆర్​ కోడ్​ జనరేట్​ అవుతుందని తెలుస్తోంది. పోర్న్​ సైట్​ అడ్రెస్​ని టైప్​ చేస్తే, ఒక లింక్​ కనిపిస్తుంది. దాని మీద క్లిక్​ చేస్తే, డిజిటల్​ వాలెట్​తో కనెక్షన్​ ఏర్పడుతుంది. ఆ వాలెట్​ ద్వారా యూజర్​ క్రిడెన్షియల్స్​ వెలుగులోకి వస్తాయి. ఇతర వివరాలేవీ ఇవ్వకుండా, కేవలం యూజర్​ వయస్సు మాత్రమే వెరిఫై చేయడం జరుగుతుంది. ఒక టోకెన్​తో ఒకే వెబ్​సైట్​ని దాదాపు 10సార్లు వినియోగించుకోవచ్చు.

మరి వినియోగదారుడి వయస్సును ఎలా వెరిఫై చేస్తారు? అంటే.. యూజర్​ వయస్సుని వెరిఫై చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఐడీని వాడతారు. ఒక నెలలో టోకెన్​లు అయిపోతే వాటిని ఎన్నిసార్లైనా రెన్యూ చేసుకోవచ్చు. టోకెన్లు పూర్తిగా అయిపోతే వాటిని రెన్యూ చేసుకోవాలని డిజిటల్​ పాస్​పోర్ట్ యాపే వారికి అలర్ట్స్​ పంపిస్తుంది. కానీ ఒకే వెబ్​సైట్​ని మాటిమాటికి వాడితే ట్రేస్​ అయ్యే రిస్క్​ ఉంటుందని సమచారం.

పోర్న్​ పాస్​పోర్ట్​ వ్యవస్థపై విమర్శలు కూడా ఉన్నాయి. మరీ ఇంత కఠినంగా తయారు చేయడం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ పోర్న్​ పాస్​పోర్ట్​ని సమర్ధిస్తోంది. ఇది ప్రైవసీ- ఫ్రెండ్లీ యాప్​ అని, వినియోగదారుల వివరాలను ట్రాక్​ చేయడానికి కుదరదని స్పష్టం చేసింది.

పోర్నోగ్రఫీ అనేది నేటి యువతను ప్రభావితం చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా చిన్నారులు, మైనర్లపై ఇది తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. దానిని అడ్డుకునేందుకు స్పెయిన్​ ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. కానీ ప్రపంచం మొత్తం ఒక్క క్లిక్​తో అందుబాటులోకి వస్తున్న ఈ యుగంలో, స్పెయిన్​ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు ఏమేరకు ఫలితాల్ని ఇస్తాయో చూడాలి. ఒక వేళ సక్సెస్​ అయితే మాత్రం, ఇతర దేశాలు కూడా దీనిని అనుసరించే అవకాశం ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం