SpaceX Crew 9 mission : సునీతా విలియమ్స్‌ని వెనక్కి తీసుకొచ్చేందుకు స్పేస్ఎక్స్ మిషన్ లాంచ్..
Sunita Williams rescue mission : ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్ సంస్థ క్రూ 9 మిషన్‌ని విజయవంతంగా లాంచ్ చేసింది. ఈ రాకెట్.. ఐఎస్ఎస్లో చిక్కుపోయిన సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లను వెనక్కి తీసుకురానుంది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో నెలల తరబడి చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లను వెనక్కి తీసుకొచ్చేందుకు రెస్క్యూ మిషన్‌ని లాంచ్ చేసింది స్పేస్ఎక్స్. ఈ మేరకు ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ఫ్లోరిడాలోని కేప్ కానవెరల్ నుంచి టేకాఫ్ అయ్యింది. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది.
"ఫాల్కన్ 9 సక్సెస్ఫుల్ లాంచ్ నేపథ్యంలో నాసా, స్పేస్ఎక్స్కి అభినందనలు," అని నాసా చీఫ్ బిల్ నెల్సన్ ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
సునీతా విలియమ్స్‌ని వెనక్కి తీసుకొచ్చేందుకు ఈ ఫాల్కన్ 9 రాకెట్లో వ్యోమగాములు నిక్ హాగ్వే, అలెగ్జాండర్ గార్బునోవ్ బయలుదేరారు. నిక్ నాసా ఆస్ట్రొనాట్ కాగా అలెగ్జాండర్ రష్యన్ కాస్మొనాట్.
వాస్తవానికి ఫ్లోరిడాలో గత కొన్ని రోజులుగా వాతావరణం బాగోలేదు. హెలెన్ తుపాను బీభత్సం సృష్టించింది. వరదలు ముంచెత్తడంతో 50కిపైగా మంది ప్రజలు మరణించారు. 10లక్షలకుపైగా మంది ప్రజలు అంధకారంలో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పేస్ఎక్స్ క్రూ 9 లాంచ్ సాధ్యమవుతుందా? అన్న సందేహాలు పెరిగాయి. వివిధ డేట్స్‌ని కూడా సంస్థ స్టాండ్బైలో పెట్టింది. కానీ అదృష్టవశాత్తు స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం రాకెట్ టేకాఫ్ అయ్యింది. అన్ని అనుకున్నట్టు జరిగితే సోమవారం తెల్లవారుజామున నాటికి ఇది ఐఎస్ఎస్ని చేరుకుంటుంది!
ఈ ఫాల్కన్ 9ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లి, సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌ని తీసుకుని ఫిబ్రవరిలో భూమి మీదకు రానుంది.
బోయింగ్ రూపొందించిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఈ ఏడాది జూన్‌లో అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్ వెళ్లారు. కానీ స్పేస్‌క్రాఫ్ట్‌లో సమస్యల కారణంగా ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వ్యోమగాములు లేకుండానే ఈ బోయింగ్ స్టార్‌లైన్ స్పేస్‌క్రాఫ్ట్ ఇటీవలే భూమికి తిరిగొచ్చింది. 8 రోజుల్లో వెనక్కి రావాల్సిన వ్యోమగాములు నెలల తరబడి ఐఎస్ఎస్లో చిక్కుకపోయారు. ఫలితంగా నాసా, ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ సాయం తీసుకోవాల్సి వచ్చింది.
సంబంధిత కథనం