Twitter | కొత్త సీఈఓ కోసం మస్క్ వేట.. పరాగ్ అగర్వాల్ ఔట్..!
అమెరికా: ట్విట్టర్‌కు కొత్త సీఈఓను తీసుకొచ్చేందుకు ఎలాన్ మస్క్ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఆ బాధ్యతల నుంచి పరాగ్ అగర్వాల్ తప్పుకోవాల్సిందే!
Elon Musk twitter | ట్విట్టర్‌ను తన వశం చేసుకున్న అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. డీల్‌ను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వార్త బయటకొచ్చింది. ట్విట్టర్‌కు కొత్త సీఈఓను తీసుకొచ్చేందుకు మస్క్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ప్రస్తుత సీఈఓ, భారత సంతతి పరాగ్ అగర్వాల్.. ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
ట్విట్టర్ బృందం, సంస్థ విధానాలపై గత కొంతకాలంగా మస్క్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టైలర్‌తో మస్క్.. గత నెలలో సంభాషణ జరిపినట్టు, ట్విట్టర్ మేనేజ్మెంట్పై తనకు నమ్మకం లేదని చెప్పినట్టు తెలిసింది. ఫలితంగా ట్విట్టర్‌కు కొత్త సీఈఓ కోసం మస్క్ అన్వేషిస్తున్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి.
Parag Agarwal | పరాగ్ అగర్వాల్.. గతేడాది నవంబర్‌లో ట్విట్టర్ సీఈఓ బాధ్యతలు చేపట్టారు. కాగా.. 12నెలలలోపు ఆ పదవి నుంచి తప్పిస్తే.. ఆయనకు 42మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.
కొన్ని రోజుల ముందే.. ట్విట్టర్లో తన భవిష్యత్తుపై సానుకూలంగా ఉన్నట్టు పరాగ్ అగర్వాల్ అభిప్రాయపడటం గమనార్హం. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి పరాగ్ అగర్వాల్ కాస్త ఒత్తిడిలోనే ఉన్నారు. ట్విట్టర్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరాగ్ అగర్వాల్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 'సంస్థలో మమ్మల్ని కొనసాగిస్తారా? లేదా?' అని అడుగుతున్నారు. వాటన్నింటికీ పరాగ్ అగర్వాల్.. సానుకూలంగానే జవాబులిస్తున్నారు.
మరి మస్క్.. నిజంగానే కొత్త సీఈఓను తీసుకొస్తారా? లేక పరాగ్నే కొనసాగిస్తారా? అన్నది వేచిచూడాలి.
ట్విట్టర్ డీల్ ఇలా..
Elon Musk twitter deal | అసలు తెరపైకి 'డీల్', 'ఆఫర్' అనే పదాలు రాక ముందు.. ట్విట్టర్లో మస్క్ 9శాతం వాటా కొన్నారు. కొన్ని రోజుల తర్వాత.. బోర్డులోకి మస్క్‌ను ట్విట్టర్ ఆహ్వానించింది. అందుకు ఆయన కూడా అంగీకరించారు. కానీ కొన్నిరోజుల్లోనే మనసు మార్చుకుని వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ట్విట్టర్ మొత్తాన్నే కొనేందుకు ఆఫర్ ఇచ్చారు. ఆ 44 బిలియన్ డాలర్ల ఆఫర్‌ను ట్విట్టర్ తీసుకుంది.
సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. డీల్‌ను పూర్తిచేసేందుకు మస్క్ వేగంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా.. టెస్లాకు చెందిన 9.6మిలియన్ షేర్లను మస్క్ అమ్మేసినట్టు సమాచారం. ఫలితంగా ఆయన.. 8.5బిలియన్ డాలర్లను సమకూర్చినట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్