స్టాక్స్​ ఎప్పుడు కొనాలి? ఎప్పుడు అమ్మాలి?- ఎలాన్​ మస్క్​ టిప్స్​ ఇవే-elon musk s advice on when to buy and sell stocks ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  స్టాక్స్​ ఎప్పుడు కొనాలి? ఎప్పుడు అమ్మాలి?- ఎలాన్​ మస్క్​ టిప్స్​ ఇవే

స్టాక్స్​ ఎప్పుడు కొనాలి? ఎప్పుడు అమ్మాలి?- ఎలాన్​ మస్క్​ టిప్స్​ ఇవే

HT Telugu Desk HT Telugu
May 01, 2022 05:52 PM IST

స్టాక్స్​ ఎప్పుడు కొనాలి? ఎప్పుడు అమ్మేయాలి? స్టాక్​మార్కెట్​లో చాలా మందికి వచ్చే ప్రశ్నలు ఇవి. తాజాగా.. వీటిపై ఎలాన్​ మస్క్​ స్పందించారు. కొన్ని టిప్స్​ ఇచ్చారు. అవేటంటే..

ఎలాన్​ మస్క్​.. స్టాక్​ మార్కెట్​ టిప్స్​ ఇవే..
ఎలాన్​ మస్క్​.. స్టాక్​ మార్కెట్​ టిప్స్​ ఇవే.. (Bloomberg)

Elon musk stock market tips | స్టాక్​ మార్కెట్​ నుంచి డబ్బులు సంపాదించాలని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. కానీ అనేకమంది స్టాక్​ మార్కెట్​లో నష్టాలు చూస్తారు. స్టాక్స్​ ఎప్పుడు కొనాలి? ఎప్పుడు అమ్మాలి? అన్న విషయంపై సరైన స్పష్టత, అవగాహన లేక తప్పులు చేసి, నష్టపోతూ ఉంటారు. వారి కోసమే.. అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​.. తన అనుభవం నుంచి కొన్ని టిప్స్​ ఇచ్చారు.

స్టాక్స్​ కొనుగోళ్లు, అమ్మకాలపై తనకు తరచూ ప్రశ్నలు వస్తుంటాయని మస్క్​ అన్నారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

"మీరు నమ్మే ప్రాడక్టులు, సర్వీసులపైనే దృష్టిపెట్టండి. అలాంటి సంస్థల స్టాక్స్​ మాత్రమే బై చేయండి. ఇక ప్రాడక్టులు, సర్వీసులు దారుణంగా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే వాటిని అమ్మేయండి," అని మస్క్​ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే మరో టిప్​ కూడా ఇచ్చారు మస్క్​. 'మార్కెట్​ తీవ్ర ఒడుదొడుకుల్లో ఉన్నప్పుడు.. మీరు కంగారు పడకండి. దీర్ఘకాలంలో ఇది మీకు ఉపయోగపడుతుంది,' అని వెల్లడించారు.

ఎలాన్​ మస్క్​కు ట్విట్టర్​లో 89మిలియన్​ మంది ఫాలోవర్లు ఉన్నారు. వారిలో చాలా మంది స్టాక్​ మార్కెట్​ బిగినర్స్​ ఉండే అవకాశం ఉంది. వారికి మస్క్​ టిప్స్​ చాలా ఉపయోగపడతాయి. పైగా.. తమకు ఇష్టమైన, లేదా సక్సెస్​ఫుల్ వ్యాపారవేత్త నుంచి సూచనలను పొందాలని చాలా మంది భావిస్తూ ఉంటారు.

ట్విట్టర్​ కోసం..

Elon Musk twitter deal | సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​ను ఎలాన్​ మస్క్​ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. డీల్​ను పూర్తిచేసేందుకు మస్క్​ వేగంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా.. టెస్లాకు చెందిన 9.6మిలియన్​ షేర్లను మస్క్​ అమ్మేసినట్టు సమాచారం. ఫలితంగా ఆయన.. 8.5బిలియన్​ డాలర్లను సమకూర్చినట్టు తెలుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్