Bengaluru Hanuman Chalisa row : నమాజ్ సమయంలో హనుమాన్ చాలీసా పెట్టాడని.. కొట్టారు!
Bengaluru crime news : నమాజ్ జరుగుతున్న సమయంలో హనుమాన్ చాలీసా వంటి భక్తి పాటలు పెట్టాడన్న కోపంతో.. కొందరు, ఓ షాప్ వ్యక్తిని దారుణంగా కొట్టారు. ఈ ఘటన.. బెంగళూరులో చోటుచేసుకుంది.
Shopkeeper attacked in Bengaluru : కర్ణాటక బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రంజాన్ నమాజ్ సమయంలో హనుమాన్ చాలీసా వంటి భక్తి పాటలు పెట్టాడన్న కారణంతో.. ఓ వ్యక్తిని కొందరు దారుణంగా కొట్టారు!
ఇదీ జరిగింది..
బెంగళూరులోని జుమ్మా మసీద్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగింది ఈ ఘటన. ముకేశ్ అనే వ్యక్తికి.. వర్ధమాన్ టెలికాం అనే మొబైల్ షాప్ ఉంది. ఆదివారం రాత్రి.. తన షాప్‌లో హనుమాన్ చాలీసా వంటి పాటలు పెట్టుకున్నాడు. ఇంతలో, ఓ వర్గానికి చెందిన వారు వచ్చి, ఆయన్ని దారుణంగా కొట్టారు.
"నా షాప్‌లో సాయంత్రం నేను భక్తి పాటలు పెట్టుకున్నాను. ఐదు, ఆరుగురు ముస్లింలు వచ్చారు. నమాజ్ సమయంలో హిందు భక్తి పాటలు ఎందుకు పెట్టావు? అని అడిగారు. ఆ తర్వాత నన్ను కొట్టారు. స్పీకర్‌తో నా తల మీద కొట్టారు. గాయమైంది," అని ముకేశ్ చెప్పాడు.
"వాళ్ల చేతిలో ఆయుధం ఉందని అనిపించింది. అందుకే బలంగా గాయమైంది. ఈ గ్రూప్ నుంచి నాకు గత 2,3 నెలలుగా వేదింపులు ఎదురవుతున్నాయి. నన్ను హింసిస్తున్నారు. డబ్బులు కావాలని కూడా బెదిరిస్తున్నారు," అని ముకేశ్ చెప్పుకొచ్చాడు.
Hanuman Chalisa played during Ramzan namaz : అయితే.. ముకేశ్ న్యాయపరంగా వెళ్లాని ప్రయత్నిస్తే.. పోలీసులు సహకరించలేదని ఆరోపణలు వస్తున్నాయి. నిందుతులపై కేసు వేసేందుకు పోలీసులు ముందుకు రాలేదని తెలుస్తోంది. ఫలితంగా.. ముకేశ్‌తో పాటు ఇతరులు.. సదరు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి, ఆందోళనకు దిగారు.
తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకున్న తర్వాతే.. పోలీసులు, నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఆ ప్రాంతంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలీసులు చర్యలు తీసుకున్నారు. అదనపు భద్రతను మోహరించారు.
దాడికి సంబంధించిన దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిని ఇక్కడ చూడండి :
గుజరాత్లో అలా..
Gujarat Muslim students attacked : గుజరాత్లో నమాజ్ చేసుకుంటున్న విదేశీ విద్యార్థులపై కొందరు దాడి చేసిన 24 గంటల వ్యవధిలోనే బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకోవడం సర్వత్రా వార్తలకెక్కింది. గుజరాత్ ఘటనలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీలో శనివారం రాత్రి జరిగింది ఈ ఘటన. బాధితులు.. అఫ్గానిస్థాన్‌తో పాటు ఇతర ఆఫ్రికెన్ దేశాల నుంచి ఇండియాకు వచ్చి చదువుకుంటున్నారు. కాగా.. రంజాన్ మాసం కావడంతో నమాజ్ చేయాలని భావించారు. కానీ.. యూనివర్సిటీలో మసీదు లేకపోవడంతో.. హాస్టల్లోకి వెళ్లారు. రమాదాన్లో రాత్రి పూట చేసే తరావీహ్ ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ఇంతలో.. కత్తులు, కర్రలు పట్టుకున్న కొందరు దండుగులు.. హాస్టల్లోకి ప్రవేశించారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు.. వారిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశాడు. చివరికి.. దుండగులు హాస్టల్లో విధ్వంసం సృష్టించి, గదులను ధ్వంసం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం