Wagh Nakh return : ఇండియాకు తిరిగిరానున్న ఛత్రపతి శివాజీ 'ఆయుధం'..!
Wagh Nakh return : ఛత్రపతి శివాజీ వాడిన వాఘ్నఘ్ ఆయుధం ప్రస్తుతం లండన్‌లో ఉంది. దీనిని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Wagh Nakh return : 1659లో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఉపయోగించిన ఆయుధం 'వాఘ్ నఘ్'.. ఎట్టకేలకు ఇండియాకు తిరిగిరానుంది! ఇంతకాలం లండన్‌లోని విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియంలో ఉన్న ఈ ఆయుధం.. ఈ నవంబర్ నాటికి దేశానికి తిరిగి వస్తుందని అంచనాలు ఉన్నాయి.
ఈ వాఘ్ నఘ్తోనే.. బిజాపూర్ సల్తనేట్ జనరల్ అఫ్జల్ ఖాన్‌ను హతమార్చారు శివాజీ. చర్మ, కండరాలను చీల్చుకునే విధంగా ఈ ఆయుధాన్ని రూపొందించారు. సైజు, ఆకారంలో చిన్నగా ఉన్నా.. ప్రత్యర్థులకు బలమైన గాయాలు చేయగలిగే సత్తా ఈ వాఘ్ నఘ్కు ఉంటుంది.
Wagh Nakh return to India : "ఛత్రపతి శివాజీ మహరాజ్ పట్టాభిషేకానికి 350ఏళ్లు పూర్తవుతోంది. ఈ ఘట్టాన్ని వేడుకగా చేసుకుంటున్నాము. అందుకే.. వాఘ్ నఘ్ను తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. శివ భక్తులందరూ ఈ ఆయుధాన్ని చూడాలి. ప్రధాని మోదీ- అమిత్ షాలు చేస్తున్న గొప్ప పనికి ఇది ఒక చిహ్నంగా నిలిచిపోతుంది. బ్రిటన్‌తో అక్టోబర్ 3న ఒక ఎంవోయూపై సంతకం చేస్తాము. వాఘ్ నఘ్ను ఇండియాకు తీసుకొస్తాము. ఈ వాఘ్నఘ్.. ఈ తరం వారికి స్ఫూర్తిదాయకంగా మారుతుంది," అని మహారాష్ట్ర సాంస్కృతికశాఖ సహాయ మంత్రి సుధీర్ ముంగంతివార్ వెల్లడించారు. ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత.. ఈ వాఘ్ నఘ్ను దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ వాస్తు సంఘ్రాలయలో ప్రదర్శను ఉంచనున్నట్టు తెలుస్తోంది.
అయితే వాఘ్ నఘ్ ఆయుధంపై విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం వాదన మరో విధంగా ఉంది. ఈ ఆయుధం.. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేమ్స్ గ్రాంట్ డుఫ్కు చెందిందని చెబుతోంది. మరాఠా పేషాకు చెందిన ప్రధాని నుంచి ఆయన దీనిని గిఫ్ట్‌గా పొందారని అంటోంది. కానీ ఆ ఆయుధంపై ఉన్న బ్లేడ్స్ మీద.. 'మొఘల్ జనరల్‌ను హతమార్చిన శివాజీ వాఘ్ నఘ్' అని రాసి ఉంది.
Chhatrapati Shivaji Maharaj Wagh Nakh weapon : అఫ్జల్ ఖాన్ హత్య.. మరాఠా చరిత్రలోనే అతి కీలకమైన ఘట్టం. భారీ మొత్తంలో సైన్యం ఉన్నప్పటికీ.. మరాఠా యోధులు రచించి మాస్టర్ ప్లాన్స్ ముందు ఖాన్ బృందం నిలబడలేకపోయింది. మరీ ముఖ్యంగా.. అఫ్జల్ ఖాన్‌ను ఇదే వాఘ్ నఘ్తో ఛత్రపతి శివాజీ హతమార్చారు. ఇదొక ఐరన్ వెపన్.
సంబంధిత కథనం