Students attacked in Gujarat : గుజరాత్​లో.. నమాజ్​ చేసుకుంటున్న విదేశీ విద్యార్థులపై దాడి!-mob assaults foreign students for offering namaz inside gujarat varsity watch ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Students Attacked In Gujarat : గుజరాత్​లో.. నమాజ్​ చేసుకుంటున్న విదేశీ విద్యార్థులపై దాడి!

Students attacked in Gujarat : గుజరాత్​లో.. నమాజ్​ చేసుకుంటున్న విదేశీ విద్యార్థులపై దాడి!

Sharath Chitturi HT Telugu
Mar 17, 2024 12:09 PM IST

Mob assaults foreign students in Gujarat : హాస్టల్​లో నమాజ్​ చేసుకుంటున్న విదేశీ విద్యార్థులపై కొందరు దుండగులు దాడి చేసిన ఘటన గుజరాత్​లో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు.

ఐదుగురు విదేశీ విద్యార్థులపై దాడి..
ఐదుగురు విదేశీ విద్యార్థులపై దాడి..

Muslim students beaten in Gujarat : గుజరాత్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హాస్టల్​లో నమాజ్​ చేసుకుంటున్న విదేశీ విద్యార్థులపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

ఇదీ జరిగింది..

అహ్మదాబాద్​లోని గుజరాత్​ యూనివర్సిటీలో శనివారం రాత్రి జరిగింది ఈ ఘటన. బాధితులు.. అఫ్గానిస్థాన్​తో పాటు ఇతర ఆఫ్రికెన్​ దేశాల నుంచి ఇండియాకు వచ్చి చదువుకుంటున్నారు. కాగా.. రంజాన్​ మాసం కావడంతో నమాజ్​ చేయాలని భావించారు. కానీ.. యూనివర్సిటీలో మసీదు లేకపోవడంతో.. హాస్టల్​లోకి వెళ్లారు. రమాదాన్​లో రాత్రి పూట చేసే తరావీహ్​ ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ఇంతలో.. కత్తులు, కర్రలు పట్టుకున్న కొందరు దండుగులు.. హాస్టల్​లోకి ప్రవేశించారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు.. వారిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశాడు. చివరికి.. దుండగులు హాస్టల్​లో విధ్వంసం సృష్టించి, గదులను ధ్వంసం చేశారు.

Mob attacks muslim students in Gujarat : "గదిలోకి వచ్చి మమ్మల్ని దారుణంగా కొట్టారు. గట్టిగా అరిచారు. హాస్టల్​లో నమాజ్​ చేసుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? అని అడిగారు. మా ల్యాప్​టాప్స్​, ఫోన్స్​ని ధ్వంసం చేశారు. బైక్స్​ని కూడా ధ్వంసం చేశారు," అని అఫ్గానిస్థాన్​కి చెందిన విద్యార్థి చెప్పాడు.

గాయపడిన ఐదుగురు విద్యార్థులు.. అఫ్గానిస్థాన్​, శ్రీలంక, తుర్కమెనిస్థాన్​, రెండు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినవారు.

"ఘటన జరిగిన అరగంట తర్వాత పోలీసులు వచ్చారు. అప్పటికి అందరు పారిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాము. ఎంబసీలకు కూడా సమాచారం ఇచ్చాము," అని సదరు విద్యార్థి చెప్పాడు.

గుజరాత్​లో నమాజ్​ చేసుకుంటున్న వారిపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. కొందరు.. హాస్టల్​పై రాళ్లు రువ్వడం, సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. 'మాకు భయంగా ఉంది', 'ఇది చాలా తప్పు,' అని విదేశీ విద్యార్థులు చెబుతుండటం.. కొన్ని వీడియోల్లో వినిపించాయి.

Gujarat crime news : "ఇక్కడ వాళ్లు నమాజ్​ ఎందుకు చేస్తున్నారు? నమాజ్​ చేయడానికి ఇదే దొరికిందా? అసలు ఇదే నమాజ్​ చేసే చోటా?" అని దుండగుల్లో ఒకరు.. సెక్యూరిటీ గార్డ్​ని ప్రశ్నించాడు. ఆ తర్వాత.. లోపలికి వెళ్లి విధ్వంసం సృష్టించారు.

ఈ ఘటనని ఏఐఎంఐఎం చీఫ్​, హైదరాబద్​ ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ తీవ్రంగా ఖండించారు.

"సిగ్గు చేటు. ముస్లింలు ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటూ, మతాన్ని అనుసరిస్తున్నప్పుడే.. మీకు మతంపై భక్తి పెరుగుతుంది. ముస్లింలను చూడగానే మీకు కోపం పెరిగిపోతుంది. అసలేంటిది? హోంమంత్రి అమిత్​ షా, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో ఇలా జరుగుతోంది. వాళ్లు జోక్యం చేసుకుంటారు?," అని ట్వీట్​ చేశారు ఓవైసీ. తన ట్వీట్​కి విదేశాంగ మంత్రి జైశంకర్​ని ట్యాగ్​ చేస్తూ.. ముస్లిం వ్యతిరేక భావాలు.. ఇండియాను నాశనం చేస్తున్నాయని రాసుకొచ్చారు.

తాజా ఘటనపై గుజరాత్​ ప్రభుత్వం స్పందించింది. ఘటనపై దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించింది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన వీడియోలను ఇక్కడ చూడండి :

(More to come)

IPL_Entry_Point

సంబంధిత కథనం